పవన్ సస్పెండ్..! జనసేనకు పడింది పెద్ద బొక్క

రాజకీయాల్లో గుర్తింపు రావాలంటే ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి. రాజకీయ పార్టీ పెట్టామంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగానే క్యాడర్, జనాదరణను పొందాలి. అలా చేయని పక్షంలో ఆ రాజకీయ పార్టీకి ఇబ్బందులు ఎదురవ్వక తప్పదనే చెప్పాలి. ప్రస్తుతం జనసేన పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చినట్లు ఈసీ తాజాగా ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా తమకు కేటాయించిన గుర్తును నిలుపుకోవాలంటే.. నిబంధనల ప్రకారం తగిన ఓట్ల శాతం తెచ్చుకోవాలి.ఒకవేళ ఓడిపోయినా తగినంత శాతం ఓట్లు కూడగట్టుకోవాలి. అప్పుడే ఆ పార్టీకి ప్రాంతీయ లేదా జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు లభిస్తుంది. అయితే జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కించుకుంది. ఆ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం ఆ పార్టీలో లేరు. గాజు గ్లాస్ గుర్తును కొనసాగించాలని జనసేన ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. పొత్తుల గోలలో పడి పెట్టిన పార్టీని గాలికి వదిలేసి,ఇప్పుడు తల బాదుకుంటే ఏం లాభం.. పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో ఏ సింబల్ తో పోటీ చేస్తావు పవన్. పార్టీ గుర్తు కూడా లేని.. నీది ఒక పార్టీనేనా..? మా నాయకుడు సిఎం అవుతాడు అంటూ కలలు కంటున్న జనసైనికులను నట్టేట ముంచావు కదా పవన్.. అంటున్నారు పబ్లిక్. చంద్రబాబు వ్యూహాల ప్రకారమే పవన్ కళ్యాణ్ పసుపు జెండా నీడలోనే ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇలా అయితే.. జనసైనుకుల కథ తెల్లారినట్టే. ఎన్నికలప్పుడులేమో అభిమానులు అటక ఎక్కించారు. ఈసారి కేంద్రం ఎన్నికల సంఘం ఏకంగా గాజు గ్లాసునే లాగేసుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ మరింత శూన్యం అయ్యారనే చెప్పాలి.అందుకే కాబోలు.. 18 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు మాత్రమే ఇస్తానని చంద్రబాబు తెగేసి చెప్పారట. చచ్చినోడికి వచ్చిందే కట్నం అన్న మాదిరిలా.. చేసేంది ఏముందిలే అని.. నేను సిఎం రేసులో లేనని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారని చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. ఈసారి కూడా పరిస్థితి మునుపటిలాగానే ఉంటే.. పవన్ కళ్యాణ్ కు రాజకీయ భావిష్యత్ ఉండదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారో.. లేక జనసైనికుల చేత సస్పెండ్ అవుతారో అనేది చూడాలి.