1.ఏపీలో పలువురు అడిషనల్ ఎస్పీల బదిలీలు..
37 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
2.వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు…
తన తల్లికి సీరియస్ గా ఉంది గనుకే విచారణకు హాజరు కాలేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం.
3.చిట్స్ నిర్వాహకులు ఇతర వ్యాపారాలు చేయకూడదని సుప్రీం స్పష్టం చేసింది.
రామోజీ తప్పు చేశారని నిర్ధారణ చేసుకున్నాకే అధికారులు చర్యలు చేపట్టారని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్య.
4.ఏపీలో ఆల్‌టైమ్ రికార్డు దాటిన కరెంట్ వినియోగం..
రాబోయే రోజుల్లో అత్యధిక వినియోగం పెరగవచ్చని విద్యుత్ శాఖ వెల్లడి.
5.ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిని నియమించిన న్యాయశాఖ.
ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ స్పెషల్ సెక్రటరీ రజిందర్ కశ్యప్ నోటిఫికేషన్ జారీ.
6.కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో అవినాశ్ రెడ్డి తల్లికి చికిత్స…
ఆమెను హైదరాబాద్ తరలించే అవకాశాలున్నట్టు సమాచారం.
7.యూట్యూబ్ చానళ్లకు కూడా జర్నలిస్ట్ అక్రిడిటేషన్ ఇస్తాం.।।
టిడ్కో ఇళ్లు కూడా ఇస్తామని నారా లోకేశ్ హామీ.
8.రెండు వేల నోటును రద్దు చేయాలని కేంద్రానికి సూచించింది తానేనన్న చంద్రబాబు..
అనకాపల్లిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు.
9.ప్రజల పక్షాన నిలిచే ఏబీఎన్‌పై దాడి సిగ్గుచేటు..
వైసీపీ నేతల అరాచకానికి పరకాష్ట అవినాష్ రెడ్డి ఘటన అని నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం.
10.స్టీల్ ప్లాంట్ కు అవసరమైన 4 వేల కోట్లు ఇస్తా..
కేంద్రం అనుమతి ఇస్తే.. సమస్య తొలగినట్టేనని డా .కె.ఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.