2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్..రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ ను ప్రధానంగా టార్గెట్ చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేయాలని, కాంగ్రెస్ కారణంగానే తనకు ఇష్టమైన అన్నయ్యకు ఎదురుగా నిలబడాల్సి వస్తుందని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హటావో.. దేశ్ కో బచావో అంటూ నినాదాన్ని ఇచ్చారు. నాడు పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు.. గొప్ప నాయకుడు అవుతారు అనుకున్నారు జనసైనికులంతా. కానీ 2014లోనే తాను భరిలోకి దిగకుండా టిడిపి , బీజేపీలకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల భరిలోకి దిగి.. ఏకంగా రెండు చోట్ల పోటీ చేసి.. దారుణంగా ఓటమిపాలయ్యారు. మళ్ళీ ఇప్పుడేమో చంద్రబాబుతో చేతులు కలిపి..
వైసీపీ హఠావో అంటున్నారు. నేను సిఎం రేసులోనే లేనని ప్రకటించుకుంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశతో పాటు సెటైర్లు వేస్తున్నారు. ఈసారి పవన్ హఠావో, ప్యాకేజీ ఇస్తే ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటారని తన ఫ్యాన్స్ పరువు తీస్తున్నారు. ఆఖరికి వైసీపీ వాళ్ళు 4సీట్లు ఇస్తామంటే.. వైసీపీతో కూడా పొత్తుకు రెడీ అని పబ్లిక్ సెటైర్లు వేస్తున్నారు.\
తమ అభిమాన నాయకుడు రాజకీయాల్లో మెయిన్ రోల్ గా వ్యవహరిస్తారని ఫ్యాన్స్ తో పాటు సైనికులు ఎంతో ఆశపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం.. ప్యాకేజీ కోసమే తమని మోసం చేసి మళ్ళీ టీడీపీతో చేతులు కలిపి.. తమ ఆశలన్నీ పటాపంచలు చేశారని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.
సైడ్ క్యారక్టర్ ఉంటే చాలు అని సర్దుకుపోతున్నారు పవన్. దోపిడీలో వాటా ఇస్తే చాలు సీఎం సీటు అడగను అని పవన్ అంటున్నాడని ఆఖరికి సిఎం జగన కూడా సెటైర్లు వేస్తున్నారు. దత్తపుత్రుడు.. దత్తపుత్రుడు.. అని ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేస్తారు. నిజంగా ఆయన దత్తపుత్రుడు కాకపోతే.. పార్టీ పెట్టి.. వేరే పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి..? ఒంటరిగా పోటీ చేసి తన దమ్ము నిరూపించుకోవచ్చుగా.. అన్న ప్రశ్నలు.. ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇలా అయితే ఎప్పటికీ పవన్ సిఎం కాలేరని పబ్లిక్ తేల్చి చెప్పేశారు. పైగా జనసేన గుర్తు గాజుగ్లాసును ఫ్రీ సింబల్ గా చేర్చుతూ.. తాజాగా ఈసీ పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్ ఇచ్చింది. చివరికి తమ పార్టీ గుర్తును కూడా కాపాడుకోలేని వాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఎం న్యాయం చేస్తారు చెప్ప౦డి..