టీడీపీలో మరో వికెట్ డౌన్ చంద్రబాబుకి మొగుడిలా మారిన కీలక నేత

ఏపీ రాజకీయాలకు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఏదైనా ఉంది అంటే.. అది బెజవాడ అనే చెప్పాలి. ఏపీలో రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. విజయవాడ రాజకీయాలు ఒక ఎత్తు అన్న మాదిరి ఉంటాయి. ఇదే బెజవాడ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. అది కాస్తా.. టిడిపి కి కంచుకోటలా మారింది. ప్రస్తుతం బెజవాడలో వైసీపీ పాగా వేసింది. వచ్చే ఎన్నికల్లో బెజవాడలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయానికొస్తే.. చంద్రబాబుకి మొగుడిలా మారారు. గత ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ హవాకి తట్టుకొని నిలబడి.. ఘన విజయం సాధించారు. కానీ ఎంపీ కేశినేని నాని గత రెండేళ్ల నుంచి ఎందుకో చంద్రబాబుకు దూరంగానే ఉంటున్నారు. బెజవాడ అభివృద్ది కోసం ముళ్ళ పందితోనైనా కలుస్తానని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో పలు రకాల చర్చలకు దారి తీస్తున్నాయి.
అసలు టీడీపీలో ఉన్న నాయకులకు కేశినేని నానికి ఎందుకు పొసగడంలేదు..? అసలు ఆయన కోపం ఎవరి మీద..? అధిష్టానం మీదనా..? లేక లోకల్ లీడర్ల మీదనా..? తను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలని అంటున్నారు అంటే.. తమలో తామే కయ్యానికి కాలు దువ్వుతున్నారు అంటే దీని వెనుక పెద్ద కథే ఉందని.. పార్టీ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఉదయభాను, జగన్మోహన్‌ లు చక్కగా సహకరిస్తున్నారని ఎంపీ కేశినేని నాని పొగిడేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే.. వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు రియాక్ట్ అయ్యారు. చేశాం కాబట్టే తనను ఎంపీ కేశినేని ప్రశంశించారు.మంచిని మంచి అని చెప్తే దాని తప్పు అని భావిస్తున్నారా..? ప్రజా ప్రతినిదులం కాబట్టి తాము ఎప్పుడు కేశినేని నానితో మాట్లాడతా, ఆయన దగ్గరకు అయిన వెళతా, నా పార్టీ సిద్ధాంతమే కులాలకు మతాలకు సేవ చేయమని చెప్పింది.. అలాంటప్పుడు కేశినేని నాని, నేను కలిసి ఎందుకు పనిచేయకూడదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే
జగన్ మోహన్ రావు కామెంట్స్ చేశారు. అయితే.. కేసినేని నానికి వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కదని కూడా ప్రచారం సాగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి టిడిపి తరుపున తమ కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కేసినేని నాని చంద్రబాబుకు విన్నవించుకున్నారట. దీనిపై అధిష్టానం మౌనంగా ఉందని, అందుకే నాని చంద్రబాబుతో దూరంగా ఉంటూ.. ఒంటరిగా పొరతాడుతున్నారని ప్రచారం సాగుతోంది. కేసినేని నాని.. ఢిల్లీ బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని కూడా పచారం సాగుతోంది. ఆయన టిడిపి కి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది. మరి కేసినేని నాని అంశం ఏటు వైపు దారి తీస్తుందో చూడాలి.