ఏ జిల్లా అయినా.. ఏ ప్రాంతమైనా.. ఏ ఊరయినా.. పార్టీలకు అతీతంగా పాలన సాగించడమే లక్ష్యంగా సిఎం జగన్ అడుగులు ముందుకేస్తున్నారు.
ఏపీ సిఎం జగన్ అధికారంలోకి వచ్చి అప్పుడే నాలుగేళ్లు అయిందా అనిపిస్తుంది. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో సిఎంజగన తీసుకొచ్చిన మార్పులు, స్కీములు, సంస్కరణలకు రాష్ట్ర ప్రజలు జే జే లు పలుకుతున్నారు. ముఖ్యంగా నేడు అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన సిఎం జగన్ రికార్డ్ సృష్టించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిలో జగన్ పని అయిపోయిందని.. ప్రతిపక్షాలు, పచ్చ మీడియా తెగ ప్రచారం చేసింది.కానీ సీన్ కట్ చేస్తే.. సిఎం జగన్ సభకు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. సభకు వచ్చిన ఈ జన ప్రభంజనాన్ని చూస్తేనే అర్ధమవుతుంది. ఇక ఈ నేపధ్యంలోనే తాడికొండ ఎమ్మెల్యే పేరు తెరపైకి వచ్చింది. ఎవమ్మా శ్రీదేవి.. అమరావతిలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని.. ఏదేదో చెప్పుకొచ్చావ్.. కానీ ఈ జనాలని చూస్తుంటే.. అందుకు రివర్స్ గా ఉందే.
జగన్ ప్రజలకు చేస్తున్న మంచిని గ్రహించలేక.. తప్పుడు దారిలో వెళ్ళి అనవసరంగా ఛాన్స్ మిస్ చేసుకున్నావ్. అదే.. తమరు పార్టీలో గనుక ఉంటే.. వచ్చే ఎన్నికల్లో కూడా తిరుగులేని మెజారిటీతో గెలిచి ఉండేదానివన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.