రాజమహేంద్రవరంలో టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మహానాడులో విషాదం నెలకొంది. మహానాడుకి వచ్చిన పార్టీ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. అయితే మొదట వీరికి ఫుడ్ పాయిజన్ అవడం వల్ల పడిపోయారని ప్రచారం సాగింది. మహానాడులో ఉదయం టిఫిన్ తినడం వల్లే ఇలా అనారోగ్యానికి గురయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే.. ఇప్పుడే అందిన బ్రేకింగ్ వార్త ఏంటంటే.. ఎండల ఎఫెక్ట్ వల్ల టిడిపి కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారని సమాచారం. ఎండలు తీవ్రంగా ఉండటంతో… మహానాడుకు వచ్చిన కార్యకర్తలలో సుమారు 20 మంది వరకు నీరసించి పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న మెడికల్ క్యాంప్ లో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఉన్న వారికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి నెలకొంది. అదే విధంగా సెలైన్లు కూడా ఎక్కిస్తున్నారు. సొమ్మసిల్లి పడిపోయిన వారిలో కొందరు వృద్దులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. మహానాడులో ఏర్పాట్లలో లోపం కారణంగానే ఈ విషాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కనీస సౌకర్యాలు లేక అక్కడికి వచ్చిన కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని సమాచారం.