షర్మిలకున్న తెగువ, ధైర్యం పవన్ కి లేదా..? మరింత చీఫ్ అయిపోతున్న జనసేన

వైఎస్ షర్మిల గురించి, ఆమెకున్న ధైర్యం గురించి, ఆమె పడే కష్టం గురించి ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఆమె తెలంగాణాలో పార్టీపెట్టి సుమారు రెండేళ్ళవుతోంది. కానీ ఆమె ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్లు అవుతోంది. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నడూ కూడా ఒంటరిగా పోరాటం చేసిన దాఖలాలు లేవు. ఆయన పోరాటం ఎప్పుడూ పొత్తులతోనే, ఆయన ఆరాటం ఎప్పుడు ప్యాకేజీ కోసమే. ప్రజలే స్వయంగా అంటోన్న మాటలు ఇవి. వైఎస్ షర్మిల ఒకవైపు కేసీయార్ ప్రభుత్వంపైన మరోవైపు బీజేపీ పైన తన పరిధిలో ఆరోపణలు, విమర్శలతో నానా రచ్చచేస్తున్నారు. ఆమెచేసే ఆరోపణలు, విమర్శలు ఒక్కోసారి హద్దులు దాటిపోయి గొడవలవుతున్నమాట వాస్తవం.
అలాంటి షర్మిల రాబోయే ఎన్నికల్లో ఒంటరిపోరాటానికే రెడీ అవుతున్నారు. ఎవరితోను పొత్తు పెట్టుకునేది లేదని ప్రకటించారు. తమ పార్టీ 43 నియోజకవర్గాల్లో గట్టి ఫోర్సుగా ఉందన్నారు. ఢిల్లీలోని ఒక సంస్ధతో సర్వేచేయిస్తే 43 నియోజకవర్గాల్లో తమ పార్టీ గట్టి ఫోర్స్ గా ఉందని తేలిందని చెప్పారట. అంటే షర్మిల ప్రకటన ప్రకారం మ్యాగ్జిమమ్ 43 సీట్లలో పోటీచేయవచ్చనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కసీటులో అయినా షర్మిలపార్టీ గెలుస్తుందో లేదో తెలీదు కానీ ఆమెలో ఆత్మవిశ్వాసం మాత్రం ఎక్కువగానే కనబడుతోంది.

కానీ.. పవన్ కళ్యాణ్ కి అంత అభిమాన గళం ఉన్నప్పటికీ.. ఒంటరిగా పోటీచేయాలంటే భయపడుతున్నారు. పొత్తులేనిదే తాను పోటీచేసే అవకాశం లేదని స్వయంగా పవనే చెప్పారు. జనసేన ఒంటరిగా పోటీచేస్తే వీరమరణం తప్పదని తానే ప్రకటించుకున్నారు. ఎన్నిసీట్లలో పోటీచేస్తారో తెలీదు.అసలు ఆయన ఎక్కడ నుండి పోటీ చేస్తారో చెప్పరు.. అసలు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక.. చంద్రబాబుకు ఎన్నికల ప్రచారం చేస్తారో అన్న సందేహాలు రాక తప్పట్లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మీటింగులు పెట్టినా.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప.. రాష్ట్ర ప్రజలకు తాను ఎం చేస్తారు అన్నది ఎప్పుడైనా చెప్పారా..? అన్నది ఆలోచించుకోవాలి. జగన్ పైన నోటికొచ్చింది మాట్లాడేయటం, పూనకం వచ్చినట్లు ఊగిపోవటం తప్ప ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా..? అంటే లేదనే సమాధానం వస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. పవన్ కళ్యాణ్ గురించి చాలానే ఉన్నాయి. సొ.. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నప్పటికీ.. ఎన్ని నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారో అన్నది చూడాలి. మొత్తానికి షర్మిలకున్న ధైర్యం కూడా పవన్లో లేదని తేలిపోయింది.