1.వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చారు….
అబద్ధాల్లో చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు ఇవ్వొచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ.
2.డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో….
2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలు చేసి గాలికొదిలేశాడు.. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అంటూ జోగి రమేష్ సెటైర్లు.
3.పేదవాళ్లను ధనికులను చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు అప్పుడెందుకు రాలేదో..
కనీసం కుప్పంలో పాఠశాలను బాగుచేయలేకపోయావంటూ బొత్స విమర్శలు.
4.తాడిపత్రిలో మరోసారి కరపత్రాలు కలకలం..
ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు కరపత్రాలు పంపిణీ. చర్చకు సిద్దం అంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రకటన.
5.బీజేపీకి ఏపీతో పనిలేదు..
ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని విజయనగరం ఎంపీ సంచలన వ్యాఖ్యలు.
6.ప్రభుత్వం న్యాయం చేయడం లేదంటూ ముగ్గురి ఆత్మహత్యాయత్నం..
తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసు ఎదుట ఘటన.
7.మినీ మేనిఫెస్టోకే ఇంతగా మంటలు పుడితే.. పూర్తి మేనిఫెస్టో వస్తే వైసీపీ నేతలకు మాటలు కూడా రావు..
మహిళలను శక్తిమంతులుగా చేయడమే చంద్రబాబు లక్ష్యమని జవహర్ వ్యాఖ్య.
8.ఇస్రో ప్రగతిని చూసి గర్వపడే క్షణాలివి..
విజయవంతంగా పనిపూర్తిచేసిన జీఎస్ఎల్వీ-12.. శాస్త్రవేత్తలకు పవన్ కల్యాణ్ అభినందనలు .
9. చంద్రబాబు చేసిన సంక్షేమం, జగన్ చేసిన మోసకారి సంక్షేమంపై చర్చకు సిద్ధం…
అమ్మవడి 16 వేలు నుండి 13 వేలు చేశావు అంటూ బోండా ఉమా ఆరోపణ.
10.పవన్‌ను విమర్శిస్తే ఊరుకోం..
ఖబడ్డార్ జగన్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జనసేన ఏలూరు ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు.