రామోజీరావుకి మరో షాక్.. మార్గదర్శి చిట్ఫండ్స్ కు చెందిన 793 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతి..

1.నేడు విజయవాడకు సిఎం జగన్..
రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవనన్ను సందర్శన.

2.అనంతపురానికి మణిహారమైన టవర్ క్లాక్ బ్రిడ్జిపై రాకపోకలు షురూ…
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.

3.తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు కన్నుమూత…
సీఎం జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర సమయంలో మద్దతుగా నిలిచిన వెంకటేశ్వరరావు.

4.సీఎం జగన్ అధ్యక్షతన జూన్ 7వ తేదీ రాష్ట్ర కేబినెట్ సమావేశం…
ప్రతిపాదనలను జూన్ 5వ తేదీ మధ్యాహ్నంలోగా సాధారణ పరిపాలనశాఖకు పంపాలని సీఎస్ జవహర్ రెడ్డి అన్ని శాఖలను ఆదేశ౦.

5.కొడాలి నానిని వైసీపీ నుంచి బహిష్కరించాలి..
ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్.

6.బ్లాక్ క్యాట్ కమాండోలు లేకుంటే చంద్రబాబు ఫినిష్..
స్పీకర్ తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

7.మహానాడు నుంచి వెళ్తూ టీడీపీ నాయకుడి దుర్మరణం..
అమలాపురం మండలం సమనస పరిధిలోని రంగాపురానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరెళ్ల రామాంజనేయులురోడ్డు ప్రమాదంలో మృతి.

8.ఏపీ సీఎస్ కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతి పత్రం
డిమాండ్లపై స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టత

9.అభివృద్ధి అంతా చంద్రబాబు చేసిందే.. వైసీపీకి మృత్యుగంటలు మోగుతున్నాయి..
అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబు నిలిచారని రఘురామ ప్రశంసల జల్లు.

10.టీడీపీ మేనిఫెస్టోను చూసి తాడేపల్లి కొంపలో భూకంపం వచ్చినట్లు అయింది..
కొడాలి నాని మాట్లాడుతున్న మాటలు సరికాదు.. తాము అధికారంలోకి వచ్చాక ఈడ్చుకొచ్చి జైల్లో వేస్తామని దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు.