1.రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ళు ఒకేసారి ఇచ్చిన నాయకుడు ఎవరూ లేరు..
సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, సీనియర్ జర్నలిస్టులు ప్రశంసలు.
2. సీఎం జగన్ నాలుగేళ్ల పాలనపై వైఎస్సార్సీపీ సంబరాలు….
పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండావిష్కరణ అనంతరం కేక్ కట్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.
3.టిడిపి మేనిఫెస్టో అమలుపై చర్చకు రా..
చంద్రబాబుకి మంత్రి కారుమూరి సవాల్.
4.నన్ను, రోజాను, కొడాలి నానిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..
చంద్రబాబు, పవన్ కల్యాణ్ సత్తెనపల్లికి వచ్చి మీటింగులు పెట్టారని అంబటి రాంబాబు వ్యాఖ్య.
5.సుజనాకు షాక్ ఇచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్
మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు.. ఈ విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశం
6.ఏపీ విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమయింది…
ఆ విధ్వంసం ఐదో ఏడాది కూడా కొనసాగుతోందని చంద్రబాబు సెటైర్లు.
7.నాలుగేళ్ల కిందట ఇదే రోజున రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ..
దేశ సేవలో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో నేనెంతో కృతజ్ఞతా భావంతో ఉన్నానంటూ ట్వీట్…
8.ప్యాలెస్ లు, కంపెనీలు ఉన్న జగన్ పెత్తందారీ కాదా ..
2004లో ఇల్లు అమ్మే స్థాయి నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారని కొల్లు రవీంద్ర ప్రశ్న.
9.మంత్రి గారూ.. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని గేట్లు ఉంటాయో తెలుసా?..
సుజల స్రవంతి అడ్రస్ ఎక్కడుందో తెలుసా? అంటూ మంత్రి అంబటిపై ఎమ్మెల్సీ అనురాధ సెటైర్లు.
10.కొడాలి నానీ..కాపుల గురించి నోటికొచ్చినట్లు వాగితే నాలుక కోస్తాం..
కాపుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ వార్నింగ్.