వైఎస్ వివేకా కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి.. తెలంగాణ హైకోర్టులో భారీ విజయం దక్కింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై ఇవాళ తుది తీర్పు వెలువరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్.. బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అవినాష్రెడ్డి లాయర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వివేకా కేసులో కస్టడీ విచారణ అవసరం లేదని బెంచ్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 17వ తేదీన అవినాష్రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి ఆ పిటిషన్పై విచారణ అనేక మలుపులు తిరిగింది. చివరికి.. సుప్రీం కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించింది. అవినాష్రెడ్డికి బెయిల్ పిటిషన్ వేసే హక్కు ఉందని, పిటిషన్పై వాదనలు వినాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా వాదనలు వింది తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్. అయితే.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐ ఎప్పటి నుంచో తహతహలాడుతూ వస్తోంది. ఇక ఎల్లో మీడియా అయితే.. అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ.. కథనాలు ప్రచురించేది. నేడు హైకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్టు అయ్యింది.అవినాష్ రెడ్డి తల్లికి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు హాజరు కాలేదని ఆయన చెప్తున్నప్పటికీ.. అవినాష్ రెడ్డి తమకు సహకరించట్లేదని సీబీఐ చెప్తూ వస్తోంది. ఇక దీనికి మరింత మసాలా దట్టించి అవినాష్ రెడ్డిపై లేని పోని వార్తలు ప్రచురించింది ఎల్లో మీడియా. ఏది ఏమైతే.. నిందారోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి ఈ ముందస్తు బెయిల్ ఒక ఊరట అనే చెప్పాలి.