అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా.. అసలు వైఎస్ వివేకా కేసు దర్యాప్తు పక్కదారి పడుతోందా..? కేసు దర్యాప్తు సజావుగా సాగట్లేదా..? అసలు ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందా..? కేసును దర్యాప్తు చేయడంలో సీబీఐ ఫెయిల్ అయ్యిందా..? అంటే అవుననే అంటోంది తెలంగాణా హైకోర్టు. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై నేడు తీర్పు వెలువరించిన కోర్టు సీబీఐకి మొట్టికాయలు వేసింది. అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటూ.. స్వయంగా సుప్రీం కోర్టు వెల్లడించింది.
అయితే.. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు పెట్టిన షరతులు ఒక్కసారి పరిశీలిస్తే..
నెంబర్ – 1.. ప్రతి శనివారం సీబీఐ విచారణ హాజరుకావాలి
నెంబర్ – 2.. ఐదు లక్షల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలి
నెంబర్ – 3.. సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదు
నెంబర్ – 4.. షరతులు ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి సూచన
హైకోర్టు ఈ షరతులను విధించింది. ఇక నుంచి సీబీఐ ఎప్పుడుపడితే అప్పుడు అవినాష్ రెడ్డిని విచారిస్తాం అంటే కుదరదు. కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే విచారించాలని పేర్కొంది తెలంగాణ హైకోర్టు.
వివేకా కేసు దర్యాప్తులో అవినాష్ ఎక్కడ సహకరించడం లేదని అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని సీబీఐ తరఫున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. హత్యకు మూడు నెలల ముందే కుట్ర జరిగిందని వివరించారు. రాజకీయ కోణంలోనే హత్య జరిగిదని పేర్కొన్నారు. ఇక ఈ వాదనలపై రియాక్ట్ అయిన హైకోర్టు..ఏ ఆధారాలతో అవినాష్‌పై అభియోగాలు మోపుతున్నారని హైకోర్టు వెకేషన్ బెంచ్ ప్రశ్నించింది. హత్య జరిగిన రోజున నిందితుడు అవినాష్ ఇంట్లో ఉన్నారని ఎలా చెప్తారని, ఆధారాల సేకరణ ఎందుకు ఆలస్యమైందని, లోక్ సభ అభ్యర్థిగా అవినాష్‌ను అనధికారికంగా ముందే ప్రకటించారు కదా ఆయన్ని అందరూ సమర్థిస్తున్నారు కదా అని కోర్టు ప్రశ్నించింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మేనేజ్ చేసి ఉండొచ్చుకదా… హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు క్రాస్ ఎగ్జామిన్ చేసింది. గదిలో రక్తం తుడిస్తే ఏమవుతుందని కోర్టు ప్రశ్నించింది. అవినాష్ వాట్సాప్ డేటా తీసుకున్నారా, ఏ 1 గంగిరెడ్డి వాట్సాప్ డేటా తీసుకున్నారా అని కోర్టు అడిగింది. తెల్లవారు జామున అవినాష్ ఎవరితో చాట్ చేశారని కోర్టు క్వశ్చన్ చేసింది. ఆధారాల సేకరణ ఎందుకు ఆలస్యమైందని కోర్టు ప్రశ్నించింది. ఫోన్ స్వాధీనం చేసుకుంటే తెలుస్తుందని.. ఐపీడీఆర్ ద్వారా వాట్సాప్ కాల్ గురించి మాత్రమే తెలుస్తుందని సీబీఐ చెప్పింది. దీంతో ఓ సీల్డ్ కవర్‌లో సాక్షుల వాంగ్మూలాలను సమర్పించింది సీబీఐ. ఓ కీలక సాక్షి ఇందులో ప్రధానమని వెల్లడించింది. కానీ వారి పేర్లను మాత్ర౦ బయటపెట్టలేదు.
ఈ కేసు విచారణలో భాగంగా ఏబీఎన్, మహా టీవీకి తెలంగాణ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏబీఎన్, మహా టీవీ ఛానళ్లలో ఈనెల 26వ తేదీ జరిగిన చర్చల వీడియోలను ఇవ్వాలని రిజిస్ట్రారు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ వీడియోలను డౌన్లోడ్ చేసి సీజేకి అందించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఆయా టీవీ చర్చల్లో పాల్గొన్న సస్పెండైన మెజిస్ట్రేట్ ఒకరు.. హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది.టీవీ ఛానళ్లలో జరిగిన చర్చ్ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. దీనిపై చర్య తీసుకోవాలా? వద్దా? అనేది హైకోర్టు నిర్ణయిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.