కోడెల ఫ్యామిలీకి చంద్రబాబు బిగ్ షాక్

ఏపీ రాజకీయాలు మాంచి హీటు పుట్టిస్తున్నాయి. రాజకీయ నాయకులు ఒకరికి మించి ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతూ.. వచ్చే ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసేందుకు అన్ని రకాల ఆప్షన్లను ఉపయోగించుకుంటున్నారు. ఈ కౌరవులను ఓడించి.. అసెంబ్లీని గౌరవ సభాగా మార్చి అప్పుడు తాను అసెంబ్లీలో అడుగు పెడతా అని చంద్రబాబు ఇప్పటికీ సవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ నేపధ్యంలోనే.. చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టి.. బలమైన వారికే టికెట్ లు కేటాయిస్తున్నారు. అభ్యర్ధులను ప్రకటించడంలో చంద్రబాబు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇక ఈఏ నేపధ్యంలోనే గుంటూరు జిల్లాపై ఫోకస్ పెట్టిన బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జీగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ.. కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన కోడెల ఫ్యామిలీకి చేదు వార్త అనే చెప్పాలి. కోడెల శివప్రసాద్ రావు అప్పట్లో పార్టీ కోసం ఎంతో కష్ట పడ్డారు. ఆయన కన్నుమూసిన తర్వాత ఆయన కుమారుడు కోడెల శివరాం కు టికెట్ దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ.. బాబు మాత్రం కోడెల శివరాం కు హ్యాండ్ఇచ్చి కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించారు.వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టే. కోడెల శివరాం లేదా ఆయన కుటుంబానికి టికెట్ కేటాయించట్లేదనే విషయాన్ని టీడీపీ చెప్పకనే చెప్పినట్టయింది. మరి పార్టీ అధిష్టానం నిర్ణయంపై కోడెల శివరాం ఎలా రియాక్ట్ అవుతారో అన్నది చూడాలి.