జగన్ సూపర్ స్కెచ్ ఉండవల్లి శ్రీదేవి, లోకేష్ కి చెక్ బాబుకి పంచె తడిచిపోయే వ్యూహం

రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒక ఎత్తైతే.. రాజధాని అమరావతి రాజకీయాలు రూటే సెపరేటు. రాజధాని నియోజకవర్గాలంటే మంగళగిరి, తాడికొండ. ఈ రెండు నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే, తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి. పార్టీ లైన్ క్రాస్ చేసిందని ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయినప్పటికీ.. ఆ స్థానం వైసీపీదే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల కాన్సెప్టును తెచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ వ్యతిరేకత ఏస్ధాయిలో ఉందనేది తెలీదు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోను వైసీపీ గెలుపు అనుమానంగా తయారైంది. ఇక వచ్చే ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో తమ హవా కొనసాగించాలని సిఎం జగన్ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలలో వైసీపీ గెలవడం ఒక ఎత్తైతే.. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాలలో వైసీపీ రెపరెపలాడటం మరో ఎత్తు అనేంతలా ఉంది పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు జగన్మోహన్ రెడ్డి అవసరమైన మార్గాన్ని రెడీ చేస్తున్నారు. అందుకనే ప్రత్యామ్నాయ ఓటుబ్యాంకును సృష్టించుకునే వ్యూహంతో రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీ చేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమరావతిలో 51 వేలమందికి ఒకేసారి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డ్ సృష్టించారు సిఎం జగన్. 51 వేలమంది అంటే సుమారు 2 లక్షలమంది అన్నమాట.

ఈ 2 లక్షలమంది జనాల్లో లక్ష ఇరవై వేల మంది పైగా ఓటర్లుంటారని అంచనా. వీళ్ళంతా రాబోయే ఎన్నికల్లో వైసీపీకే ఓట్లేస్తారని జగన్ భావిస్తున్నట్లున్నారు. జగన్ వ్యూహం ప్రకారం వీళ్ళంతా ఓట్లేస్తే రెండు నియోజకవర్గాల్లోను వైసీపీ గెలుపు ఖాయమన్నట్లే. పట్టాలు అందుకోబోతున్న లబ్దిదారుల్లో మంగళగిరిలో సుమారు 80 వేలమంది ఓటర్లవుతారు. మిగిలిన లబ్దిదారులు తాడేపల్లి నియోజకవర్గంలో పరిధిలోకి వస్తారు. పట్టాలిచ్చి, ఇళ్ళు ఏర్పాటయ్యే సమయానికి ఎన్నికలు రానే వస్తాయి. కాబ్టటి లబ్దిదారులు వైసీపీని మరచిపోరన్నది జగన్ ఆలోచన. గూడు లేని పేద బ్రతుకులకు చక్కటి నీడనిచ్చిన నాయకుడికి జనం అన్యాయం చేయరని వైసీపీ ఆంచనా. ఎన్నికల సమయంలో కళ్ళు మూసుకొని వైసీపీకే ఓట్లు గుద్దుతారన్నది వారి భావన. నిజానికి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరికి చేసింది శూన్యం అన్నది లోకల్ టాక్. మరి అలాంటి విపత్కరమైన పరిస్థితులలో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది వారే పరిశీలన చేసుకోవాలి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.