జగన్ కి కేంద్రం సపోర్ట్.. పవన్ పై దిమ్మతిరిగే వ్యూహం చంద్రబాబుకి నిద్రపట్టని రాత్రులు

ఏపీలో టోటల్ గా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఎన్నికలు నేడో రేపో అన్న విధంగా.. అన్ని పార్టీల నాయకులు చావో రేవో అంటూ ప్రచారాలు మొదలెట్టేశారు. ఓ వైపు సిఎం జగన్.. మరో వైపు.. చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ .. అవసరమైతే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏకం అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మళ్ళీ వైఎస్ జగన్ సింగిల్ గానే భరిలోకి దిగుతున్నారు. కానీ ఈ తోడేళ్ల గుంప౦తా కలసికట్టుగా దాడి చేయబోతున్నాయి. అయినా డోంట్ కేర్ అంటూ.. ప్రతిపక్షాలకు సవాళ్ళ మీద సవాళ్ళు చేస్తూ.. వారికి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు.. సిఎం జగన్. ఏది ఏమైనా, ఎందరు ఏకమైనా.. తనకి పూర్తి ప్రజా మద్దతు ఉందని జగన్ విశ్వసిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితులలో చీలనివ్వనని మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికి పలుమార్లు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే.. పవన్ తన వరాహితో రంగంలోకి దిగేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆయన ఈ ప్రకటన చేసి.. ఇప్పటికీ ముమ్మారు వాయిదా పడటంతో పవన్ జనంలో నవ్వుల పాలయ్యారు. పవన్ ఒక వీకెండ్ పొలిటీషన్ అని.. ఈయనకు సినిమాలు తప్ప రాజకీయాలు పనికిరావని, ప్యాకేజీ కోసమే తన వారాహి యాత్రను వాయిదా వేసుకున్నారని స్వయంగా పవన్ అభిమానుల్లో కొందరు ఆయనను ర్యాగింగ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. జూన్ 14వ తేదీ నుంచి.. పవన్ తన వారాహిపై ప్రజలకు దర్శనమివ్వనున్నారని.. నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుండి ప్రారభమయి.. భీమవరం వరకు సాగుతుందని నాదెండ్ల ప్రకటించారు. సీన్ కట్ చేస్తే.. సిఎం జగన్ పదేపదే ఢిల్లీ వెళ్ళిరావడంపై ముందస్తు ఎన్నికల ఊహాగానాలు పెద్ద ఎత్తున చెలరేగాయి. చంద్రబాబు కూడా అదే మాట పదేపదే ఉచ్చరిస్తూనే ఉన్నారు. చంద్రబాబు మహానాడులో మినీ మ్యానిఫేస్టోని రిలీజ్ చేశారు. అంటే ముందస్తు ఎన్నికల సన్నాహమే ఇది అంటున్నారు. బాబుకు తెలిసింది. పవన్ కి తెలియకుండా ఉంటుందా. అసలు పవన్ ను నడిపించేది చంద్రబాబే అని బహిరంగంగానే చర్చలు నడుస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు నవంబర్ డిసెంబర్ లలో జరుగుతాయని గట్టిగా భావిస్తున్నారు తాను కమిట్ అయిన సినిమాలకు విరామం ప్రకటించి మరీ ఆయన వారాహి రధమేసుకుని రోడ్ల మీదకు రాబోతున్నారు.తాజాగా సిఎం జగన్ డిల్లీ వెళ్ళిన సమయంలోనే హడావుడిగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం ప్రారంభమయింది. ఈ నెల 7వ తేదీన ఏపీ కేబినెట్ మీటింగ్ సమావేశం ఉందని.. స్వయంగా సీఎస్ జవహర్ ప్రకటించారు. ఈ భేటీలో కీలక నిర్ణయమంటే ముందస్తు ఎన్నికలే అన్న ప్రచారం ఊపందుకుంది.

మరో వైపు.. నవంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఇందు కోసం సమీక్షలు చేస్తోంది. కావాల్సిన సమాచారం సేకరిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరగాల్సిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడు ఎందుకు సన్నాహాలు అనే అనుమానం చాలా మందికి వచ్చింది.దీంతో ఎక్కువ మంది జగన్ .. తెలంగాణతో పాటు ముందస్తుకు వెళ్లడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. తమకి ముందస్తుకి వెళ్లాల్సిన అవసరం ఏముందని వైసీపీ పైపైకి చెప్తున్నప్పటికీ.. తెరవెనుక అసలు కథ నడుస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం సహకారం తప్పని సరి.అయితే ఈ అంశంలో సిఎం జగన్ కి కేంద్రం సపోర్ట్ లభిస్తోందని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీకి ముందస్తుకు సహకరించాలన్న విజ్ఞప్తి చేశారని ఆయన మీ ఇష్టం అన్నారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీ పర్యటనలోనూ ఆయనకు ఈ అంశంపై స్పష్టత రావడంతో ఏడో తేదీన కేబినెట్ సమావేశం నిర్వహణకు సిద్ధమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అంటే ముందస్తు ఎన్నికలు పెట్టాలంటే ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. మరి దీనిపై అసలు క్లారిటీ రావాలంటే.. జూన్ 7న జరగబోయే కేబినెట్ సమావేశం వరకు ఆగాల్సిందే.

ఇక చంద్రబాబు కూడా ఇదే తరహా ప్రకటనలు చేస్తూ తమ పార్టీ క్యాడర్ లో మరింత జోష్ నింపుతున్నారు. గోదావరి జిల్లాలో ఏ పార్టీకి అత్యదిక స్థానాలు వస్తే ఆ పార్టీనే సిఎం పీఠాన్ని చేజిక్కింజుకుంటుందని ఎప్పటినుంచో సెంటిమెంట్ ఉంది. చంద్రబాబు కూడా గోదావరి జిల్లాల మీదనే ఫోకస్ పెట్టేసింది. మహానాడుని అక్కడే నిర్వహించింది. వానొచ్చినా.. వరదొచ్చినా పరామర్శలకు చంద్రబాబు ఎక్కువ శాతం గోదావరి జిల్లాలకే వెళతారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందుకే.. ఆయన వారాహి యాత్ర గోదావరి జిల్లాల నుంచే మొదలు పెడుతున్నారు. ఇక్కడే టిడిపి-జనసేనకు కాస్త ఇబ్బంది తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా సీట్ల పంపకంలో తేడాలు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చంద్రబాబు ఎలా డీల్ చేస్తారన్నది ఇంపార్టెంట్. మరి సిఎం జగన జూన్ 7 న ఎం నిర్ణయిస్తారో చూడాలి.