రాజకీయాలందు టిడిపి రాజకీయాలే వెరయా.. కంపు రాజకీయాలకు టిడిపి పెట్టింది పేరు. తాము అధికారంలో ఉంటే.. తమదే రాజ్యం అంటూ.. రాష్ట్ర ప్రజలను నిత్యం దోచుకు తినడమే వారి పని. దోచుకొని తినడంలో టిడిపి నేతలకు మించిన వారు లేరనే చెప్పాలి. దోచుకో-పంచుకో – తినుకో.. అని సిఎం జగన్ ఊరికే చెప్పలేదు. ఆఖరికి మారుగుదొడ్ల నిధులను కూడా ఓ టిడిపి ఎమ్మెల్యే మింగేశారు. ఈ తంతు తెలుసుకున్న ప్రజలు మోహాన ఉమ్మేస్తున్నారు.ఈ ఘటన ఎక్కడ జరిగినది అంటే.. ప్రకాశం జిల్లా కొండపి నియోజకర్గంలో ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి రేపిన కంపు రాజకీయానికి అక్కడి ప్రజలు నిరసనలు చేస్తున్నారు. అసలు ఎం జరిగిందంటే.. స్వచ్ఛ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో విడుదల చేసిన నిధులు 2014–19 టీడీపీ నేతలు తప్పుడు పేర్లతో కొల్లగొట్టారు. పేదలకు కేటాయించిన మరుగుదొడ్ల నిధులను కూడా కొట్టేశారు అంటే.. టిడిపి ఎంతటి నీచానికి దిగజారిందో అర్ధం చేస్కోవాలి. ఇక ఇదే క్రమంలో తమకు న్యాయం కావాలని నిరసనలు చేస్తున్న ప్రజలకు వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు మద్దతుగా నిలిచి పేదలకు న్యాయం చేకూరాలని చెంబులతో ఎమ్మెల్యే స్వామి ఇంటికి’ విన్నూత నిరసన కార్యక్రమం నిర్వహించారు. 22 కోట్లు దోచుకున్నారని అశోక్ బాబు ఆరోపించారు మరుగుదొడ్ల లెక్కలు తేల్చేవరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇక ఈ నేపధ్యంలోనే కొండపి నియోజకర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు
తీరుని నిరశిస్తూ నాయుడుపాలెం నుంచి ఎమ్మెల్యే స్వామి, టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీగా టంగుటూరు బయలు దేరారు. అయితే జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ ఎమ్మెల్యే స్వామి చొక్కా చినిగింది. చివరకు ఎమ్మెల్యే స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. టంగుటూరు వెళ్లాల్సిందే అంటూ జాతీయ రహదారిపై వాహనాలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.