రాజకీయాలలో చంద్రబాబు రాజకీయాలు వేరనే చెప్పాలి. గేరు మార్చి రూటు మార్చడంలో ఆయనకే సాధ్యం. వైఎస్ జగన్ లక్ష్యంగా రాజకీయాలు స్టార్ట్ చేశారు. నాడు ప్రత్యేక హోదా కోసం మోడీపై పోరాటం చేసి.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న అదే చంద్రబాబు నేడు.. అదే బీజేపీతో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. అది మీ రాజకీయం మీ ఇష్టం అనుకోండి. కానీ కేసుల మాఫీ కోసమే జగన్ కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని… ఆరోపించడం వెనక చంద్రబాబు అసలు రాజకీయానికి తెరలేపుతున్నారు. అంతేకాదు.. చంద్రబాబు తరచూ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు తీసుకొస్తున్నారు.2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కారణంతోనే బీజేపీకి దూరం అయ్యారు. ఒకరకంగా చెప్పుకోవాలి అంటే.. అలా బీజేపీకి చంద్రబాబు దూరం అవడానికి జగన్ మైండ్ గేమ్ అని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది.దీని ద్వారా సీఎం జగన్- బీజేపీ మధ్య బంధం పైన గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ తమ పైన అనుసరించిన విధానాన్నే ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీతో సఖ్యత కోసం చివరి వరకు ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు..ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నాయి.
కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన సీఎం జగన్.. కేంద్రం ముందు మెడలు వంచారని బాబు పదేపదే ఆరోపిస్తున్నారు. విభజన చట్టంలో అంశాలను నెరవేర్చాల్సిన కేంద్రం పైన జగన్ ఒత్తిడి తేవాల్సిన సమయంలో కేంద్రంతో లాలూచీ పడుతున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలా అయినా సిఎం జగన్ రెచ్చిపోయి బీజేపీపై తిరుగుబాటు చేస్తారని.. ఇది నాడు జగన్ అమలు చేసిన మైండ్ గేమ్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పడు తాజాగా
బీజేపీతో కలిసి వెళ్లేలా ఈ మేరకు జేపీ నడ్డాతో, అమిత్ షాతో మంతనాలు జరిపారు. ఇక ఈ నేపధ్యంలోనే.. ఓ వార్త అయితే ఏపీ రాజకీయాలలో తెగ ప్రచారం సాగుతోంది. అదేంటంటే.. కేవలం తెలంగాణలో పొత్తులకు ఒకే చెప్పినట్టు.. ఏపీలో పొత్తులకు నో చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. అందుకనే చంద్రబాబు మౌనంగా ఉన్నారని కూడా ప్రచారం సాగుతోంది. అసలు ఢిల్లీలో ఎం జరిగిందో చంద్రబాబు ఎందుకు బయట పెట్టలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా రాష్ట్రం మీద కానీ.. రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రేమే ఉంటే.. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా.. హోదా కోసం పోరాటం చేయవచ్చని, కానీ నాడు ప్యాకేజీ తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏమీ ఎరుగని వాడిలా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. మరి ఏపీలో పొత్తుల విషయంలో ఎలాంటి బాంబ్ పేల్చుతుందో చూడాలి.