బాబుకు ఢిల్లీ అధిష్టానం గట్టి దెబ్బ జగన్ కి గుడ్ న్యూస్

ఏపీ సిఎం జగన్ తనదైన శైలిలో పాలన అందిస్తూ.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ది పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నారు. అయినా సరే చంద్రబాబు అండ్ కో బ్యాచ్ జగన్ సర్కారుపై నిత్యం బురద జల్లుతున్నారు. సిఎం జగన్ అధికార హోదాలో ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టటంలో విజయం సాధిస్తుంటే.. చంద్రబాబు , ఎల్లో మీడియా మాత్రం తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే జగన్ డిల్లీ వెళ్తున్నారని, అవినాష్ రెడ్డి కోసమే ఈ పరుగులు అంటూ.. నోటికొచ్చినట్టు మాట్లాడటం, చేతికొచ్చినట్టు రాయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ జగన్ డిల్లీ వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పాలి. తాజాగా కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కి 12911 కోట్ల నిధులు విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు నేడు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును చాలాకాలం తర్వాత సందర్శించారు. అక్కడ అధికారులతో తాజా పరిస్ధితిపై చర్చి౦చి.. అనంతరం వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చి తిరిగి రానున్నారు. గత ప్రభుత్వం చేసిన బిగ్ మిస్టేక్ కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని తప్పు గత ప్రభుత్వానిదేనని స్వయంగా కేంద్రమే స్పష్టతనిచ్చింది.