వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు తెగ స్టంట్ లు వేస్తున్నారు. కొండకు వెంట్రుక వేస్తే సరిపోతుందా.. అందుకు బలమైన వ్యూహ౦ కావాలి. అదే పొత్తుల వ్యూహం. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖరారైంది. బీజేపీని కలిసి రావాలంటూ ఈ రెండు పార్టీలు ఆహ్వనిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటనలోనూ చంద్రబాబు అమిత్ షా ముందు ఇదే ప్రతిపాదన చేసారు. దీని ద్వారా పరోక్షంగా తాము అందరం కలిస్తేనే సీఎం జగన్ ను ఓడించగలమనే సంకేతాలు ఇస్తున్నారు. 2014లోనే సింగిల్ గా పోటీ చేసిన వైసీపీ 1.95 శాతం ఓట్ల తేడాతో ప్రతిపక్షానికి పరిమితం అయింది. మరి ఇప్పుడు జగన్ పాలన నచ్చి.. మళ్ళీ జగన్ కే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పలు సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. జగన్ పైన అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబు ప్రతీ సభలో చెబుతున్నారు. జగన్ సంక్షేమ పథకాల గురించి టీడీపీ విమర్శలు చేస్తోంది. ఇప్పుడు తిరిగి అదే సంక్షేమం ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన టీడీపీ పరోక్షంగా జగన్ బాటలోనే పయణిస్తోంది. అటు జగన్ ఎవరు ఎవరితో కలిసినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని పదే పదే చెబుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తామని చెప్తూ.. అంతిమ లక్ష్యం జగన్ ను ఓడించటమే పనిగా పెట్టుకున్నారు పవన్ ఇక ఇదే మాట బీజేపీ పెద్దల వద్ద కూడా ఒప్పుకున్నారట. ఇప్పుడు ఢిల్లీ సమావేశాల సమయంలోనూ సీఎం జగన్ కు ప్రజా బలం గురించి ప్రతిపక్షాలే ప్రచారం కల్పిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ – జగన్ మధ్య సంబంధాల వేళ ఇది రాజకీయంగా కొత్త సమీకరణాలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.