ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ ప్రజలు బ్రహ్మరథం సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

1.ఓపీఎసికి దీటుగా పెన్షన్ స్కీమ్…
ఉద్యోగులు 50 శాతం బెనిఫిట్ పొందే విధంగా ఈ విధానం ఉంటుందన్న ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్రెడ్డి వెల్లడి.

2. ఈ నెల 8న ఈ ఆటోలను ప్రారంభించనున్న సిఎం జగన్..
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ చెత్త సేకరణ కోసం 516 ఈ ఆటోల కేటాయింపు.

3.నేడు ఏపీ కేబినెట్ భేటీ..
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.

4.చంద్రబాబు ఇంటి జప్తు విచారణ 16కు వాయిదా..
ఇంటి జప్తునకు ఇప్పటికిప్పుడు అనుమతి ఇవ్వలేమని, ప్రాధమిక ఆధారాలపై విచారణ జరపాలని కోర్టు వెల్లడి.

5.అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలంటూ.. వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్..
విచారణ సజావుగా సాగేందుకు బెయిల్ ఉపసంహరించేలా ఆదేశాలివ్వాలంటూ విజ్ఞప్తి..

6.2024 ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయానికి కృషిచేద్దాం..
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పిలుపు.

7.లోకేష్‌కి ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయన మేనమామ నియోజకవర్గం కమలాపురంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఆయన ధైర్య సాహసాలను అభినందిస్తున్నానని రఘురామ వ్యాఖ్య.

8.కార్యకర్తల ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోంది..
తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యలు.

9.వామపక్షాల ఆందోళన 11కు వాయిదా..
కేంద్ర హోంమంత్రి పర్యటనను నిరసిస్తూ పది వామపక్ష పార్టీలు తలపెట్టిన ఉమ్మడి ఆందోళన .

10.ఆగస్టు 7న తిరుపతిలో జాతీయ ఓబీసీ సభ..
ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు వెల్లడి.