తాము చేసిన శంఖుస్తాపనలే మళ్ళీ మళ్ళీ తిరిగి సిఎం జగన్ శంఖుస్తాపనలు చేస్తున్నారని చంద్రబాబు అండ్ కొ తెగ ప్రచారం చేశారు. నిజంగా తమరు శంఖుస్తాపనలు చేసి ఉంటే,, ఆ ప్రాజెక్ట్ పనులలో ఎందుకు పురోగతి లేదు..? అంటే టిడిపి ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్ట్ లను పడగొట్టి.. మళ్ళీ శంఖుస్తాపనాలు చేస్తున్నారా..? చంద్రబాబు చెప్పే మాటలు అలానే ఉన్నాయి. గత నెలలో సిఎం జగన్ మచిలీపట్నం పోర్టుకు శంఖుస్థాపన చేశారు. దేనిపై చంద్రబాబు అండ్ కొ నానా విమర్శలు చేశారు. కానీ ఆయన శంఖుస్థాపన చేసి నెల రోజులు కూడా పూర్తవకుండానే.. మచిలీపట్నం పోర్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. సిఎం జగన్ చొరవతో, స్థానిక ఎమ్మెల్యే కృషితో.. పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ 150 మీటర్ల సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రీయల్ ఎస్టేట్ పెట్టుబడులకు భారీగా డిమాండ్ పెరిగింది. కృష్ణాజిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ లు ఆసక్తి కనబరుస్తున్నారు. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం పూర్తయితే.. ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే.. విదేశాలకు ఆహార ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే విషయంలో ఏపీ దూసుకెళుతున్న వైనం గణాంకాల సహితంగా బయటకు వచ్చింది. ఆహార ఎగుమతులకు సంబంధించి జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు.. మార్కెటింగ్ సౌకర్యాలతో కొత్త అంకం మొదలైంది. నాలుగేళ్ల వ్యవధిలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులుభారీగా పెరిగాయి.