కోటంరెడ్డికి షాక్..!

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదని మనసులో పెట్టుకొని ఇలా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారా అంటే చాలా వరకు అవుననే సమాధానం వస్తుంది. ఆయనకు పదవి దక్కలేదనే ఈ విధంగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారని ఆ పార్టీలోని కొందరు నేతలు అంటున్నారు.
సీనియర్ ఎమ్మెల్యే అయిన తనను కాదని ఇప్పటికే జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు కట్టబెట్టిన సీఎం జగన్ తీరుపైనే కోటంరెడ్డి అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. పలు సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల తీరుపై విమర్శలుప గుప్పించడం, స్ధానికంగా తానే స్వయంగా రంగంలోకి దిగి పనులు చేస్తూ కనిపించడంతో తాజాగా ఆయన అసంతృప్తిని గమనించిన జగన్.. పిలిపించుకుని మాట్లాడారు. అయినా ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే వైసీపీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. కోటంరెడ్డి తీరుతో వైసీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంచార్జ్ ని నియమించే ఆలోచన చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ గా నియమిస్తారని ప్రచారం సాగుతుంది. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే.. కోటంరెడ్డి వేసే స్టెప్ ని బట్టి ఈ నిర్ణయం తీసుకుంటారని నెల్లూరు జిల్లా నాయకులు అంటున్నమాట.

తాజాగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి జగన్ ను కలిశారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా ముందుకు కదులుతోందని కూడా విజయ్ కుమార్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు.ఆనం కుటుంబం మొత్తం వైసీపీని వీడుతోందన్న ప్రచారానికి తెరదించే ప్రక్రియగా విజయ్ కుమార్ రెడ్డి వెళ్లి జగన్ మోహ్మన్ రెడ్డిని కలిసినప్పటికీ ఇప్పుడది ఆయనకు ప్రయోజనకరంగా మారింది. సరిగ్గా కోటంరెడ్డి తిరుగుబాటు ప్రారంభమైన నేపత్యంలోనే విజయ్ వెళ్లి జగన్ ను కలిశారు. దానితో అధినేత దృష్టిలో పడిపోవడంతో కోటంరెడ్డిని దెబ్బకొట్టేందుకు విజయ్ ను ఇంఛార్జ్ గా పెడతారన్న ప్రచారం మొదలైంది. చూడాలి మరి నెల్లూరు రాజకీయాలు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనేది.