పచ్చ బ్యాచ్ కి భ‌జ‌న.. భ‌జ‌న.. జ‌య‌ము జ‌య‌ము చంద్ర‌న్నపై కేంద్రం ఉక్కుపాదం

తప్పు తమదైనా.. మోసం మనదైనా.. వాటిని చాలా ఈజీగా ఎదుటివారిపై నెట్టేయడమే టీడీపీ నైజం. అవును.. అంతా తమకు అనుకూలంగా ఉంటే.. ఒక లెక్క.. లేకుంటే మరో లెక్క. అదే ఇప్పుడు టీడీపీకి కడుపు మంట. పోల‌వ‌రం ప్రాజెక్టుపై పచ్చ బ్యాచ్ డ్రామా షురూ చేసింది. అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు.. అన్న సామెత ప్రకారం.. పోల‌వ‌రం ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పటికీ.. టీడీపీ మాత్రం దానిని కూడా నానా రచ్చ చేస్తోందనుకోండి. పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్ర‌బాబు ఏటీఎంగా వాడుకున్నారంటూ స్వ‌యంగా న‌రేంద్ర‌మోడీనే ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఏదో తూతూ మంత్రంగా ఎన్నికలు వచ్చే సరికి 2018లో నానా హడావిడి చేశారు.. సీన్ కట్ చేస్తే టిడిపి చేసింది మాత్రం 10 % కూడా లేదనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటారా..? దీనికి కారణం టిడిపి నేతలే. మేము పోలవరం చూడాలంటూ.. కూడబలుక్కొని మరీ.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ పోలవరం బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు ముదనుగానే అరెస్ట్ చేశారు. పైగా.. తాము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం చూడటానికి బస్సులు పెట్టి మరీ చూపించామని టిడిపి నేతలు అంటున్నారు. ఈ ప్రాజెక్టు విష‌యంలో కూడా కేవ‌లం ప్ర‌చారం కోస‌మే ఆరాట‌ప‌డ్డారు. పోల‌వ‌రం చూడ‌టానికి అని ప్ర‌భుత్వ సొమ్ముల‌తో బ‌స్సుల‌ను తిప్పి అక్క‌డా దొంగ బిల్లుల‌తో కోట్లు దోచేసుకున్నారు. జ‌య‌ము జ‌య‌ము చంద్ర‌న్న అంటూ.. భ‌జ‌న బ్యాచ్ తో పాట‌లు పాడించడం. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు చూడనివ్వరు అంటూ టిడిపి నేతలు తెగ హంగామా చేస్తున్నారు. ఏదోలా ఆ విష‌యంలో బుర‌ద‌జ‌ల్ల‌డ‌మే ప‌నిగా పెట్టుకుని పచ్చ బ్యాచ్ అంతా కలిసి.. చంద్రబాబుకి భజన చేస్తోంది. అసలు చంద్రబాబు హయాంలో చేసిన తప్పిదాల వల్ల, ఆత్రం వల్ల ప్రాజెక్ట్ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు సిఎం జగన్ కృషి వల్ల ప్రాజెక్ట్ పనులు సాఫీగా సాగుతున్నప్పటికీ.. టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవ‌లే పోల‌వ‌రానికి కేంద్రం నుంచి ఎంతో కొంత ఇంధ‌నం అందింది. ఇక ముందు కూడా ప్రాజెక్ట్ పనులకు నిధులు మంజూరు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇదండీ.. పచ్చ బ్యాచ్ కడుపు మంట. వారిని పోలవరం ప్రాజెక్ట్ ను చూడటానికి వెళ్ళనివ్వాలదని పచ్చ బ్యాచ్ అంతా రగిలిపోతుంది.