టీడీపీ నేతలు అరెస్ట్ రోడ్డున పడ్డ తెలుగదేశం పాతాళానికి చంద్రబాబు

1.బాబూ.. దేవుడితో పరాచకాడితే ఇంకా పాతాళానికి పోతావ్..
దేవాదాయ శాఖ, యజ్ఞాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టు సత్యనారాయణ సీరియస్.

2.ఆరిపోయిన పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు.. ఐటీడీపీకి ఆ సంగతి ఆ తెలియదేమో!..
ఎన్టీఆర్ని ఎలా వెన్నుపోటు పొడిచారో కూడా తెలీదా? అంటూ మంత్రిజోగి రమేష్ ప్రశ్న.

3. వై నాట్ 175 అనే నినాదం తీసుకోవడంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది..
సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పూర్తి విశ్వాసంతో పక్కాగా విజయం సాధిస్తామన్న మల్లాది విష్ణు.

4.టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని..
విజయవాడ తెలుగదేశం రాజకీయాలు రోడ్డున పడ్డాయి అంటూ కౌంటర్!

5.విదేశీ గడ్డపై సొంత దేశాన్ని విమర్శించడం ఏ నాయకుడికి తగదు:
రాహుల్‌పై అమిత్ షా ఆగ్రహం

6.వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు..
విజయవాడలోని టాప్ స్టార్ ఆసుపత్రికి తరలింపు.. యాంజియోగ్రామ్ నిర్వహించి, స్టంట్ వేసిన వైద్యులు.

7.జగన్ దగ్గరికి ఐదు సార్లు వెళ్లాను.. టికెట్ ఇవ్వమని మొహాన ఉమ్మేసినట్టు చెప్పారు..
చంద్రబాబు టికెట్ ఇస్తే పోటీ చేస్తా, ఇవ్వకున్నా పార్టీ కోసం పని చేస్తానని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్య

8.పశ్చిమగోదావరి జిల్లా చించినాడలో దళిత భూముల్లోని మట్టిని తరలిస్తున్నారు..
వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అక్రమ తవ్వకాలు చేస్తున్నారంటూ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ.

9.పోలీసుల అదుపులో దేవినేని ఉమా.. కొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలింపు..
పోలవరం పర్యటనకు బయలుదేరిన నేపధ్యంలో అడ్డుకున్న పోలీసులు

10.వివేకా హత్య కేసులో మరోమారు సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి..
వివేకా హత్య జరిగిన రోజు జరిగిన ఫోన్ సంభాషణలపై అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించే అవకాశం.