హరిరామ జోగయ్యకు హైకోర్టు షాక్

కాపు నేత హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం జగన్ కి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆయనకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసేందుకు యత్నించారంటూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మండిపడింది. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్‌ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. మీరు దాఖలు చేసిన పిటిషన్‌లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉంది అని మీకన్నా అనిపిస్తోందా? వ్యవగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. మా విలువైన సమయాన్ని వృథా చేయవద్దుని సూచించింది. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్‌ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. సూచించింది.ఈ మధ్య తెలంగాణ గవర్నర్‌ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్‌ న్యూసెన్స్‌ కేసులు ఎక్కువయ్యాయని అసహనం వ్యక్తం చేసింది. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారిందని పేర్కొంది. మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది.