కర్నూలు జిల్లా రాజకీయాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువగా నడుస్తుంటాయి. కర్నూలులో తెలుగుదేశం పార్టీకి మాంచి పట్టుంది. కానీ.. ఆ పట్టును పార్టీ కోల్పోతుందనే చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు ఉన్న సీన్ ఇప్పుడు లేదనే చాలా స్పష్టంగా అర్ధంఅవుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల ఫలితాలను చూస్తేనే అర్ధంఅవుతుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. కర్నూలుకు చెందిన, దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీలో ఉన్న కపట్రాళ్ల వెంకటప్పయ్య నాయుడు కుమార్తె తాజాగా వైసీపీ జెండా మెడలో వేసుకోవటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బొజ్జమ్మ అలియాస్ సుశీలమ్మ ఆమె భర్త ఇద్దరు తాజాగా వైసీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చేరిన ఈ చేరిక కర్నూలు రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుందని చెబుతున్నారు. టీడీపీ కోసమే తమ కుటుంబం బలైందని.. అయినా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు బొజ్జమ్మ. తన తండ్రి స్థానంలో తాను టీడీపీకి పనిచేశానని.. తన తండ్రిని చంపించిన వారిని చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారన్నారు. గుర్తించని పార్టీలో ఉండటం అనవసరం అనిపించిందన్నారు. అందుకే తాము వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. తాజాగా చేరికతో కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ కనుమరుగైనట్లేనని మంత్రి జయరాం వ్యాఖ్యానించటం గమనార్హం. ఇప్పడు
సుశీలమ్మ వైసీపీలో చేరడంతో ఆమెకు ఏదో ఒక పదవిని కట్టబెడతారన్న వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఆమెకు సిఎం జగన్ ఎలాంటి పదవి ఇస్తారో అన్నది.