స్టోరీలు అల్లడంలో.. అల్లిన స్టోరీలకు ఇంకాస్త గరం మషాలా దట్టించి.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎల్లో మీడియాకి మించిన వారు ఇంకొకరు ఉండరనే చెప్పాలి. ఎట్టెట్టా.. జగన్‌ను పంపించేద్దాం అంటూ రాతలా.. ఓటర్లు కులపరంగా విడిపోవద్దని ప్రకటనలా.. ఇవి పవన్ కళ్యాణ్ అన్నారంటూ.. తాజాగా పచ్చ మీడియాలో ప్రచురితం అయ్యింది. అసలు జగన్ పంపించేద్దాం అని మీరు అనుకుంటే సరిపోతుందా..? మధ్యలో ప్రజలు ఆటబొమ్మలా.. ఎవరో చెప్పింది వినేసి.. ఓట్లు వేసి గెలిపించడానికి ప్రజలు ఎవ్వరూ చెవిలో పూలు పెట్టుకొని కూర్చోలేదు. నా వల్ల ప్రజలకు మంచి జరిగితే అతనికే ఓట్లు వేసి గెలిపించండి.. లేదంటే.. లేదు అని జగన్ బహిరంగంగా చెప్తున్నారు. అలా చెప్పే దమ్ము పవన్ కళ్యాణ్, చంద్రబాబు.. ఈ ఎల్లో మీడియాకి లేదు కాబట్టే.. కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. నిజానికి ఏ ఒక్క కులమో ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అవ్వరు. రాజకీయాలు వేరు కులాలు వేరు అని పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా గమనించాలి. తాము రాసిందే వార్త.. తాము చెప్పిందే నిజం అని జనాన్ని నమ్మించడంలో ఇప్పటి వరకు నెట్టుకురాగలిగింది కానీ..పాలిటిక్స్ లో బలమైన అభ్యర్ధిని ఢీ కొట్టాలంటే.. ప్రత్యర్ధి కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. లేదంటే గేమ్ వన్ సైడ్ అయ్యడం చాలా ఈజీ. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోయిన ఓ వ్యక్తిని తమ పత్రికల్లో పతాక శీర్షికలకు తీసుకువెళ్లారంటే పచ్చ మీడియా ఎక్కడికి దిగజారిందో అర్ధం చేస్కోవాలి.
ఇదే పవన్ కల్యాణ్ గతంలో ఇదే ఎల్లో మీడియా గురించి ఏం మాట్లాడారో.. గుర్తు చేసుకుంటే.. ఈ ఇంటర్వ్యూలు మొదటి పేజీలో వేసిన పత్రికలు కనీసం సిగ్గుపడేవి. పవన్ కల్యాణ్‌కి నాలుక మడతేయటం చాలా ఈజీ, ఎల్లో మీడియాకు అతన్ని వాడుకోవటం అంతకన్నా ఈజీ. ఫైనల్ గా వీరందరూ.. చంద్రబాబు చెప్పు చేతల్లో నడుస్తున్నారన్నది.. వాస్తవం. ఒంటరిగా పోటీ చేసి గెలవలేని వాడు వచ్చే ఎన్నికల్లో సిఎం జగన్ ఒడిపోతారని తన చిలకతోనో, ఎలకతోనో ఒక జ్యోతిష్యం చెప్పిస్తాడు. ప్రస్తుతం ఎల్లో మీడియా కూడా అలానే చేస్తోందని చెప్పాలి. సిఎం జగన్ ప్రభుత్వంలో ఇప్పటికే 2.16 లక్షల కోట్ల డీబీటీ జరిగిందా? లేదా? ఇటువంటి మేలు చరిత్రలో ఎప్పుడైనా ఇంటింటికీ జరిగిందా అన్నది ఈ ఎల్లో మీడియా ఎందుకు చూపించట్లేదు. ప్రభుత్వం విఫలం అయిన వాటిని చూపిస్తుంది.. అక్కడికి ఒకే అనుకుంటే.. ప్రభుత్వం 99% ప్రజలకు లబ్ది చేకూరుస్తుంది.. అమరి వీటిని ఎందుకు చూపట్లేదు అంటే.. వారు ఒక వర్గానికి చెందిన వారు కాబట్టి. అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటాడో అతనికే తెలియదు. అతను ఒక అవకాశ వాది అని అందరూ అంటుంటారు. అవసరమైతే.. ఎల్లో మీడియాని ఇరికించడానికి కూడా వెనకాడరనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ నోటితో మాట్లాడి.. నొసలతో వెక్కిరించే స్వభావం కలిగిన వ్యక్తి.