ముద్రగడ వ్యూహం అదిరింది ఎంట్రీ మామూలుగా లేదు

కులాల చుట్టూ ఏపీ రాజకీయాలు తిరగడం కొత్తేమీకాదు. ఎన్నికల సమయానికి కుల రాజకీయాలు పీక్స్ కి చేరడం ఎప్పుడూ ఉండే తంతే. కానీ ఈసారి మాత్రం అంతకు మించి అన్న విధంగా ఉంది ఏపీ రాజకీయాల పరిస్థితి. తాజాగా ఇప్పుడు ఏపీలో మూడు రెండు పార్టీల్లో ఎవరు విజయం సాధించిన ఇద్దరికీ మేలే అన్నట్లుగా ఏపీ రాజకీయాలు మరింత హాట్ గా తయారయ్యాయి. ఇప్పుడు జనసేనాని చేస్తున్న వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. తన కులం పక్కకులం అనే తేడాలేకుండా నోటికి పనిచెపుతున్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలు కాపుల చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇది ఈనాటి విషయం కాదు. ఏపీలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలో నిర్ణయించే సామర్థ్యమున్న ఓటర్లు కాపులకు దశాబ్దాలుగా ఉన్నారు. అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్ బ్యాంక్‌ కీలకం. కాపులు ఎటు వైపు ఉంటే అదే పార్టీ గెలుస్తుందన్న నమ్మకం కూడా ఏనాటి నుంచో ఉంది. ఇక వైసీపీ కూడా తెర వెనుక అసలు సిసలు కథ నడుపుతోందనే చెప్పాలి. ఎందుకంటే ముద్రగడతో కొద్ది రోజుల క్రితం వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్ళిన నాటి నుండి.. ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై తిరుగుబాటు కూడా స్టార్ట్ చేశారు. దీంతో ముద్రగడ అసలైన వ్యూహం బయటపడింది అంటున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకే ఇలా రియాక్ట్ అవుతున్నారని వాదనలు వస్తున్నాయి. మరి ముద్రగడ పద్మనాభం వైసీపీలో ఎప్పుడు చెరిపోతారో చూడాలి.