రామోజీరావుకి సీఐడీ బిగ్ షాక్ ఈసారి కథ వేరేలా ఉంటుంది

మార్గదర్శి చిట్ ఫండ్స్ లో తొవ్వఈనా కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. అయితే ఈ కేసులు సంబందించి.. రామోజీరావు,శైలజా కిరణ్ లకు సీఐడీ మరోమారు షాక్ ఇచ్చింది. జూలై 5వ తేదీన విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీస్కి హాజరు కావాలని సీఐడీ నోటీసులు అందజేసింది. 41ఏ కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. కాగా విచారణ కోసం శైలజ కిరణ్ నివాసానికి వెళ్లినప్పుడు తమ సిబ్బందిలోని 10 మందిని అనుమతించకుండా అభ్యంతరం తెలిపారన్నారు సీఐడీ అధికారి. ఆర్థిక అక్రమాలను సంబంధించి ఆధారాలపై ప్రశ్నించాల్సిన సాంకేతిక అధికారులను అడ్డుకునేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు. తాము చట్టం పరిధిలోనే విచారిస్తున్నప్పటికీ శైలజ కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పదే పదే ఆటంకాలు కల్పించేందుకు యత్నించారని చెప్పారు.
అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీగా పూర్తి సమాచారాన్ని ఆమె వద్ద ఉంచుకోలేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపారు. ఎండీ వద్ద పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా నిధుల మళ్లింపుపై వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆమె పదే పదే ప్రయత్నించారన్నారు. విచారించిన ప్రతిసారీ ఏదో సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంగా ఉందన్నారు.

శైలజ కిరణ్ పదే పదే ఆటంకాలు కల్పిస్తుండటంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామని వివరించారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని చెప్పారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధులు 793 కోట్లను అటాచ్ చేసేందుకు న్యాయస్థానంలో త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు.