పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పేరుకు ముందు పవర్ ఉంది కానీ రాజకీయాలలో ఆయనకు పవర్ లేదు. ఇకపై కూడా రాదు అని అంటున్నారు.. పబ్లిక్.
జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్లు గడిచినప్పటికీ.. ఒక్కసారికూడా పవర్ లో లేరు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీచేసి.. రెండుచోట్ల ఓడిపోయారు. సరే.. గతం గతః.. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు..? మళ్ళీ రెండు నియోజకవర్గాల నుండి భరిలోకి దిగుతారా..? ఒకవేళ మళ్ళీ రెండు చోట్ల పోటీ చేస్తే గతంలో మాదిరిగానే ఓటమి చవి చూస్తారా..? అసలు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా..? ఈ ప్రశ్నలన్నీ పవన్ మౌనంమే కారణం. ప్రస్తుతం పవన్ చేస్తున్న వారాహి యాత్రలో భాగంగా నానా రచ్చ రేపుతున్నారు. ఆయన చేసే వ్యాఖ్యకు వివాదాస్పదంగా ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలపై ఆరివపను చేస్తూ.. రౌడీలు అంటూ ఒక రాజకీయ పార్టీ అధినాయకుడు ఏ విధంగా అయితే మాట్లాడకూడదో.. నోరుజారీ మాట్లాడుతున్నారని నిపుణులు సైతం అంటున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచే మరోసారి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే జనసేన కీలక నాయకులు నాగబాబు, నాదేండ్ల మనోహర్ తరచూ విశాఖ జిల్లాలో పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణులను అలెర్ట్ చేస్తున్నారు. అటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పవన్ కూడా గాజువాక వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇక ఈ నేపధ్యంలోనే.. గాజువాకలో పవన్ ను మరోసారి మట్టికరిపించాలని సిఎం జగన్ పక్కా ప్లాన్ ఒకటి రెడీ చేసుకున్నారు.
త్వరలో జగన్ గాజువాకలో ల్యాండ్ అవబోతున్నారు. అక్కడ ఇరవై వేల మందికి ఇళ్ళ పట్టాలను పంచబోతున్నారు. ఏపీఐఐసీ, గాజువాక హౌస్ కమిటీ గుర్తించిన ఈ పేదలందరికీ పట్టాలు జగన్ పంపిణీ చేయనున్నారు. గాజువాకలో ఇరవై వేల మందికి ఇళ్ళ పట్టాలు అంటే చాలా భారీ కార్యక్రమం కిందనే చూడాలి. రెండు లక్షల మంది ఓటర్లు ఉన్న గాజువాకలో ఇరవై వేల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు అంటే కుటుంబ సభ్యులతో కలుపుకున్న యాభై నుంచి అరవై వేల మంది దాకా ఉన్న ఓటర్ల మీద ఇది బ్రహ్మాస్త్రం అని అన్న మాట. లబ్ది పొందిన అన్ని కుటుంబాలు జగన్ కి జి కొడితే కనుక.. ఈసారి కూడా పవన్ చాప్టర్ క్లోజ్ అని చెప్పాలి. రేపటి ఎన్నికల్లో టీడీపీ జనసేన కలసి పోటీ చేసినా గతంలో వైసీపీకి వచ్చిన డెబ్బై అయిదు వేల ఓట్లను రాబట్టుకోవడమే కాకుండా అదనంగా మరో 50 వేల ఓట్లను తెచ్చుకుంటే ఎన్ని పార్టీలు కలసినా ఢోకా లేదని వైసీపీ ఆలోచనగా ఉంది అంటున్నారు. మరి సిఎం జగన్ మంత్రం గాజువాకలో ఏ మేరకు వర్క్ ఔట్ అవుతుందో అనేది చూడాలి.