కేశినేని నానికి షాక్ ఇచ్చిన బాబు

వచ్చే ఎన్నికల్లో వారికి మాత్రం టికెట్ ఇస్తే.. పార్టీ గెలుపు కోసం పని చేసేది లేదని, టిడిపి లో ఉన్న కొందరి నాయకులను ఉద్దేశించి.. కేశినేని నాని నిర్మొహమాటంగా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.నీతి, నిజాయితీ, క్యారెక్టర్‌ ఉన్న అభ్యర్థి అయితేనే.. సపోర్ట్ చేస్తాననీ ఎంపీ కేశినేని నాని ఇటీవలే కామెంట్ చేశారు. తాను చెప్పినట్టు వినకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కూడా క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తనకు ఏపీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కూడా కేశినేని నాని బహిరంగంగానే ప్రకటన చేశారు. అసలే.. ఓ వైపు కేశినేని నాని మండిపోతుంటే.. దానికి చంద్రబాబు మరింత ఆజ్యం పోశారు. తాజాగా చంద్రబాబు కేశినేని చిన్ని కలవడం ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. చిన్నిని స్వయంగా బాబు తమ ఇంటికి పిలిపించుకున్నారట. బాబు ఇంటికి వెళ్లిన కేశినేని చిన్ని.. పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ శతయంతి ఉత్సవాల సందర్భంగా కేశినేని ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు.. అన్నా క్యాంటీన్ల నిర్వహణ, మెగా మెడికల్ క్యాంపుల గురించి చర్చించామంటున్నారు కేశినేని చిన్ని. కానీ ఇక్కడ మ్యాటర్ వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయవాడలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. మరి చంద్రబాబు, కేసినేని చిన్ని భేటీలపై ఎంపీ కేశినేని నాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.