రమాప్రభ పద్నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా లేడీ కమెడియన్‌గా కూడా అలరించింది.
వయోభారం కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ, అడుక్కునే పరిస్థితికి వచ్చిందని రమాప్రభపై ఇటీవల వచ్చిన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై తాజాగా రమాప్రభ స్పందించారు.
యూట్యూబ్ లో అడుక్కుని తిన్నాను అని రాస్తున్నారు. నేను నా స్వంత యూట్యూబ్ ఛానెల్ రమాప్రభ ట్రావెల్లో నా ఇంటిని కూడా చూపించాను. నేను అడుక్కుంటుంటే అది నా ఇల్లు ఎలా అవుతుంది? నేను బిజీగా పని చేస్తున్నా.. అలాంటిది ఏ గ్యాప్‌లో అడుక్కున్నాను? కొందరు సెలబ్రిటీలు నామీద ఆప్యాయతతో నన్ను ఆదుకుంటున్నారు. వాళ్లు నన్ను ఇంటి మనిషిగా ఫీలైనప్పుడు అది సహాయమో, అడుక్కోవడమో ఎందుకవుతుంది? వాళ్లు నాకు భిక్ష వేయడం లేదు.. ప్రేమతో ఇస్తున్నారు.