కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మరోసారి వార్తల్లోకెక్కారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరీ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో పెను దుమారానికి దారి తీస్తున్నాయి. నానీకి నా చరిత్ర తెలియదు. అతను నా గురించి మరింత తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయాలి” అని రేణుక చెప్పడం విశేషం. ఈ క్రమంలోనే ఆమె ఓ ప్రకటన కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ, ఖమ్మం నుంచి పోటీకి దిగుతున్నారని ప్రకటించారు. గుడివాడ నుంచి పోటీ చేయాలని ఆమెను కొందరు కోరుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని కూడా వ్యాఖ్యానించారు.
గతంలో కూడా ఎమ్మెల్యే కొడాలి నాని, రేణుకా చౌదరి మధ్య మాంచి రాజకీయ మాటల యుద్దమే జరిగింది. ఖమ్మంలో కార్పొరేటర్గా గెలవలేని ఆమె కూడా తమ నాయకుడు జగన్ గురించి మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. ఏపీ రాజకీయాల్లో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని నాని ఎగతాళి చేశారు. ఈ నేపధ్యంలోనే ఆమెపై నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇలానే రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. తమరికి కూడా అదే గతి పడుతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ముందు ఖమ్మంలో గెలిచి చూపించు ఆ తర్వాత గుడివాడలో పోటీ సంగతి చూస్కోవచ్చు అంటూ వ్యంగ్యoగా పోస్టులు క్రియేట్ చేస్తున్నారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించడానికి చంద్రబాబు వల్లే కావడంలేదు.. మీ వల్ల ఏమవుతుంది అంటూ.. కొడాలి నానికి మద్దతు ప్రకటిస్తున్నారు. మరి ఆమె గుడివాడ నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించడంపై కొడాలి నాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా 1986–1998 వరకు టీడీపీ తరఫున రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. 1998లో ఆమె కాంగ్రెస్లో చేరారు. 2009, 2019 ఎన్నికల్లో ఆమె ఖమ్మం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.