జగన్ కి జై కొట్టిన టీడీపీ సీనియర్ నేత

కులమతాలు అన్న బేదాలు లేకుండా.. వేరే పార్టీ అన్న తారతమ్యం లేకుండా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తాం.. అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో.. ప్రస్తుతం ఆ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.. సీఏం జగన్. అమ్మఒడి, విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పేదలందరికీ ఇళ్లు..వంటి సంక్షేమ పథకాల అమలులో లబ్దిదారుడు ఏ పార్టీ అనేది చూడట్లేదు.రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచీ దీన్ని పకడ్బందీగా అమలు చేస్తూ వస్తోన్నారాయన. ఈ నేపధ్యంలోనే.. చదువుకునే పేద విద్యారులకు సీఏం జగన్ మరింత భరోసాగా నిలుస్తున్నారు. విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు అభ్యసించడానికై చాలామంది విధ్యార్ధులు ఎంతో ఆశ పడుతుంటారు. కానీ అందుకు ఆర్ధిక భారం చాలా ఎక్కువ ఉండటంతో చాలా మంది ఆశాల్ని చంపుకొని విదేశీ విద్యకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఏం జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి టీడీపీ నేత కుమార్తె ఎంపికయ్యారు.తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ బొడ్రోతు శ్రీనివాసరావు కుమార్తె శైలజకు 84 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. విజయనగరం జిల్లా వంగర మండలానికి చెందిన టీడీపీ నాయకుడాయన. చాలాకాలంగా ఆయన టీడీపీలో క్రియాశీలకంగా పని చేస్తోన్నారు.

ఆయన కుమార్తె శైలజ ప్రస్తుతం వాషింగ్టన్ లోని యూనివర్శిటీలో చదువుకుంటోన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఆమె ఎంపికయ్యారు. తొలి విడతగా ఆమె ఖాతాలో 13,99,154 రూపాయల ప్రభుత్వం జమ చేసింది. శైలజ రెండు సంవత్సరాల చదువుకు అయ్యే 84 లక్షల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు.జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ఆర్థిక సాయం అందడం పట్ల శ్రీనివాసరావు కుమార్తె శైలజ ఆనందం వ్యక్తం చేశారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంలో తన కుమార్తెను ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని శైలజ తండ్రి శ్రీనివాసరావు అన్నారు. జనం కోసం నిరంతరం పని చేసే వ్యక్తిగా అభివర్ణించారు. తన కూతురు హైద్రాబాద్ లో ఐఐటీ చదివిందని, ఇప్పుడు జగనన్న విదేశీ విద్యా దీవెనతో మంచి యూనివర్సీటీలో సీటు సంపాదించిందని చెప్పారు. భవిష్యత్తులో తన కూతురు ఏపీ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు.