రాజుగారు రానివారు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఫిబ్రవరి 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మురళీ కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమా 17వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే నటుడు కిరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఇలా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తున్న ఈయనకు ఒక నెటిజన్ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా నెటిజన్ కిరణ్ అబ్బవరాన్ని ప్రశ్నిస్తూ..అన్న నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని ప్రశ్నించాడు. ఇలా ప్రశ్నించడమే కాకుండా వెంటనే ఈ ప్రశ్న నువ్వు చూసి కూడా రిప్లై ఇవ్వకపోతే నువ్వు ఎప్పటికీ సింగిల్ గానే ఉండిపోతావు అంటూ చెప్పుకొచ్చారు. ఇది చూసిన నటుడు కిరణ్ అబ్బవరం ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి తమ్ముడు అంతమాట అన్నావ్ అంటూ రీప్లే ఇచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.