ఫోన్ ట్యాపింగ్ పై కోటంరెడ్డి ఫిర్యాదు

నేరుగా వెళ్లి అమిత్ షాను కలిసి ఫోన్ ట్యాపింగ్‌పై లేఖ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నా. ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తే నాపై విమర్శలు చేస్తున్నారు. నేను ఆరోపణలు చేసినప్పుడు మీరు కూడా సరైన పద్దతితో మాట్లాడాలి. నాపై శాపనార్థాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. నేను కేసులకు భయపడను.. కేసులు నాకు కొత్త కాదు అంటూ.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ వాళ్లే నా ఫోన్ ట్యాప్ చేసి నన్ను అవమానపరిచారు. జగన్ ఆదేశాలతోనే నా ఫోన్ ట్యాప్ చేశారు. నిజాలు బయటపెట్టిన నాపై వైసీపీ నేతలందరూ మూకుమ్మడిగా దాడి చేస్తూ ఇష్టమొచ్చినట్లు తిడుతున్నార౦టూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయి. నన్ను అరెస్ట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపించినా నా గొంతు ప్రశ్నించడం ఆగదు’ అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.