నారా లోకేష్ తన ఫ్యూచర్ ని డిసైడ్ చేయడానికి యువగళం అనే పేరుతో పాదయాత్ర చేపట్టారు. లోకేష్ ఎంత పండితుడో పెద్దగా చెప్పాల్సిన పనిలేదనుకోండి. ఆయన మాట్లాడే మాటల్ని ఆఖరికి టిడిపి నాయకులు కూడా ఎగతాళి చేస్తారు. అంతెందుకు లోకేష్ ఎక్కడ నోరు జారీ ఎక్కడ తమ పరువు తీస్తారో అన్న బయం చంద్రబాబుకు కూడా ఉందనుకోండి. రాజకీయాలలో చంద్రబాబు ఎంతటి మేధావో అందరికీ తెలిసిన విషయమే. అయితే.. లోకేష్ ని తనంత నాయకుడిని చేయాలని అది తాను చూడాలని చంద్రబాబు ఆరాటం. అందుకే.. తన పనులన్నీటినీ పక్కన పెట్టి మరీ.. చంద్రబాబు లోకేష్ పాదయాత్రకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. లోకేష్ పాదయాత్రను హిట్ చేయాలని బాబు తపన, తాపత్రయ పడుతున్నారు.
అయితే లోకేష్ పాదయాత్రకు అనుకున్నంత గా ఊపు రావడంలేదని అంతా అంటున్నారు. తొలిరోజు ఫుల్ పబ్లిసిటీ తో అదరగొట్టిన పాదయాత్ర రోజురోజుకీ ఆదరణ తగ్గుతూ వస్తుంది. ఇక టీడీపీలోనే కొందరు లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేస్తున్నారు. పాదయాత్రలకు కాలం చెల్లిందని జేసీ దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలు చేయడం వేస్ట్ అని కూడా జేసీ అనేశారు. పాదాయాత్రల కాన్సెప్ట్ కి కాలం చెల్లింది అని ఆయన ఒక్క ముక్కలో తేల్చేశారు. ఈ రోజుల్లో జనాలు పాదయాత్రను అసలు పట్టించుకోవడం లేదని కుండబద్ధలు కొట్టేశారు. తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయినా నారా లోకేష్ అయినా ఇంకెవరు అయినా ఇపుడు పాదయాత్రలు చేసినా ఏమీ లాభం లేదని పెద్దాయన తనదైన శైలిలో విశ్లేషించారు. గతంలో పాదయాత్రలు వేరు ఇపుడు వేరు అని ఒక తేడాను కూడా చెబుతున్నారు. గతంలో జనంతో పాదయాత్రలు సాగితే ఇపుడు డబ్బుతో కూడుకున్న పాదయాత్రలే సాగుతున్నాయని అంటున్నారు. అందువల్లనే జనాలు వీటిని అసలు ఎక్కడా పట్టించుకోవడం లేదని జేసీ దివాకరరెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పేశారు.