ఫోన్ ట్యాపింగ్ కాదు.. ఫోన్ రికార్డింగ్, స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

1.నౌకల నిర్మాణంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ కొత్త రికార్డు!…
డైవింగ్ సపోర్టు వెసల్ నిర్మాణంలో భారీ డీజిల్ జనరేటర్ల ఏర్పాటు

2.జియో ట్యాంగింగ్ ద్వారా సివిల్ సప్లై వాహనాన్ని ట్రాక్ చేస్తాం…
ధాన్యం సప్లై ఎలా జరుగుతుందో మానిటర్ చేయడానికే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసిన మంత్రి కారుమూరి.

3.ఏపీ మంత్రి రోజాను కలిసిన ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవీయ
మహిళా భద్రత, సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో దేశయాత్ర నిర్వహిస్తున్నట్లు మంత్రికి వివరణ.

4.రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డుకు ఎంపికైన డాక్టర్ ఏబీకే ప్రసాద్..
ఆధ్రప్రదేశ్ నుంచి వెలువడిన ప్రధాన పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన అరుదైన గౌరవం దక్కించుకున్న వైనం.

5.కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ ట్యాపింగ్ కాలేదు.. అది ఫోన్ రికార్డింగ్..
స్వయంగా ముందుకు వచ్చి నిజాలు వెల్లడించిన కోటంరెడ్డి మిత్రుడు రామశివారెడ్డి.

6.ఏపీ రాజధాని అమరావతే..
పార్లమెంటులో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

7. అనకాపల్లిలో న్యూ ఎనర్జీ పార్క్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
మొత్తంగా లక్ష పదివేల కోట్ల పెట్టుబడి. 61వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం.

8.పంచాయతీ నిధులను ప్రభుత్వం మళ్లించిందంటూ రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిటీషన్..
నిధులను ఒక అకౌంట్‌లో నుంచి మరో అకౌంట్‌కు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు

9. బీసీలపై ఈ ముఖ్యమంత్రికి ప్రేముంటే రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు…
టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని లోకేష్ హామీ.

10.మా నమ్మకం నువ్వే జగన్…
ఏపీలో ఈ నెల 11 నుంచి వైసీపీ కొత్త కార్యక్రమం