రఘురామకు చిత్రహింసలు…హైకోర్టు సంచలన తీర్పు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తనకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఐడి పోలీసులు తననను చిత్రహింసకు గురి చేసారని, ఎప్పటి నుంచో దీనిపై విచారణ జరపాలని.. కేంద్రాన్ని కొరినప్పటికీ.. కేంద్రం స్పందించడంలేదని కూడా ఒకానొక సందర్బంలో వ్యాఖ్యానించారు. అయితే తనకు హైకోర్టులో న్యాయం దక్కుతుందని.. ఎంపీ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేసి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసారని రఘురామ తన పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ లేదా స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ చేత దర్యాప్తు చేయించాలని, ఈ దర్యాప్తును స్వయంగా హైకోర్టే పర్యవేక్షించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యులైన అధికారులపై సంబంధిత కోర్టు క్రిమినల్‌ చర్యలు ప్రారంభించేలా ఆదేశించాలని అభ్యర్ధించారు.తాజాగా ఈ వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. కేంద్ర హోం శాఖకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ విచారణలో భాగంగా రఘురామ తరపు న్యాయవాది, కేంద్ర ప్రభుత్వం, సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సీఏం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటీషన్ దాఖలు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించటంతో రఘురామ పై కక్షగట్టి తప్పుడు కేసులతో అరెస్ట్ చేసారని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో అరెస్టు చేసిన సీఐడీ.. ఆయనను కస్టడీలో తీవ్ర చిత్రహింసలకు గురిచేసిందని రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ౦ కావాలనే చేస్తుందని అభివర్ణించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర హోం శాఖకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసారు.