లోకేష్ పాదయాత్ర ఆరంభించింది మొదలు.. ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజే అపశృతి చోటు చేసుకుంది. లోకేష్ పై ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలోనే లోకేష్ పై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. జీడీ నెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డిపల్లిలో ఆయన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. స్టూల్ పైకి ఎక్కి లోకేశ్ మాట్లాడుతుండగా… ఆ స్టూల్ ను పోలీసులు లాగేసే ప్రయత్నం చేశారు. చేతిలో ఉన్న మైక్ ను సైతం పోలీసులు లాగేసుకున్నారు. దీంతో పోలీసులపై లోకేశ్, టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై వాగ్వాదానికి దిగారు. అసలు మాకు అడ్డు చెప్పడానికి మీరెవరు అంటూ.. లోకేష్ వేలు చూపిస్తూ పోలీసులపై దూషణకు దిగారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని చూపిస్తూ పోలీసులపై లోకేశ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మైక్‌ను ఇచ్చేయాలని పోలీసులను కోరారు.
ఈ నేపధ్యంలోనే చిత్తూరు జిల్లా నర్సంగరాయపేట పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లోకేష్‌పై పెట్టిన ఐదో కేసు ఇది. ఈరోజు ఉదయం ఎఫ్ఐఆర్ను పోలీసులు వెబ్సైట్లో పెట్టారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం, పాదయాత్రకు ఉన్నతాధికారులు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించడం వంటి సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అయ్యింది. 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించడం, షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లాఘించి తమ ఇష్టం వచ్చినట్టు పాదయాత్ర చేయడం..ఇలా ఇస్తాను సారంగా వ్యవహరిస్తున్నారని, అందుకే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.
పోలీసు ఉన్నాతాధికారులే ఈ మేరకు ఫిర్యాదు చేశారు. లోకేష్ పైనే కాదు.. పులివర్తి నాని,అమర్నాథ్ రెడ్డి, ప్రకాష్ లపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది.