వైసీపీలో అంతర్గత పోరు రోజు రోజుకు పెరిగిపోతుందా..? సొంత పార్టీలో నేతలకు తమలో తమకే పొత్తు కుదరట్లేదా..? ఆధిపత్య పోరు కోసమా..? లేకా ఇంకేమైనా ఆశించి ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాధులు ఇచ్చుకుంటున్నారు. అసలే ఎన్నికలు తరుముకొస్తున్న వేళ సీఏం జగన్ మరింత జాగర్తగా ఆచి తూచి అడుగులు వేస్తుంటే.. పార్టీలో ఉన్న నాయకులు మాత్రం.. తిరుగుబాటు చేస్తున్నారు. నెల్లూరు పరిణామాల తరువాత పార్టీలో నేతల మధ్య విభేదాలను సీరియస్ గా తీసుకున్నారు సీఏం జగన్. నెల్లూరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఇద్దరు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మరో ఇద్దరు నేతలకు అప్పగించారు. ఈ పంచాయితీలు ఇక్కడితో ఆగేలా లేవు.
ఇప్పుడు తాజాగా.. మైలవరం పంచాయితీ తెరపైకి వచ్చింది. అక్కడ మంత్రి జోగి రమేష్ వర్సస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొద్ది రోజులుగా వసంత పార్టీ మారుతారంటూ ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆయన తండ్రి కూడా కేసినేని నానితో భేటీ అయ్యారు. అవ్వాడమే కాదు.. ప్రభుత్వంలో కొన్ని తప్పులను కూడా ఎత్తి చూపారు. ఆ తర్వాత గుంటూరు ఘటనలో NRI కి తమ మద్ధతు ప్రకటించారు. ఇన్ని పరిణామాల మధ్య.. ఆయన పార్టీ మారుతున్నారు అన్న ప్రచారం తెగ ఊపందుకుంది. ఈ నేపధ్యంలోనే సీఏం జగన్ మైలవరం పంచాయితీ పైన ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడు సీఎం నుంచి పిలుపు రావటంతో..మైలవరం విషయంలో సీఎం ఆయనతో మాట్లాడిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. చివరకు మైలవరం పంచాయితీ ఎలాంటి మలుపు తిరుగుతుందో అనేది చూడాలి మరి.