మూడు రాజధానులపై జగన్ సర్కారు పట్టు పట్టింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో నలుగుతోంది. అమరావతే రాజధాని కావాలంటూ టిడిపి.. కాదు మూడు రాజధానులతో వికేంద్రీకర జరుగుతుందని.. జగన్ సర్కార్ నిత్యం ఎవరి వాదనలు వారు వినిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖకు మేము షిఫ్ట్ అవుతున్నాం, అక్కడ నుంచే పాలన సాగిస్తాం అని కూడా స్వయంగా సీఏం జగన్ చెప్పడంతో.. టిడిపి మరింతగా స్పందిస్తూ.. జగన్ సర్కారుపై విరుచుకుపడుతుంది. ఇక ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు చేయాలని జగన్ సర్కారు సుప్రీం కోర్టును కోరింది. ఏపీలో మూడు రాజధానులు అమరావతి, విశాఖపట్నం, కర్నూలుకు సంబంధించిన అంశం 23వ తేదీన స్పష్టత రానుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్న న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులతోపాటు కేంద్రానికి కూడా నోటీసులు జారీచేసింది.ఈ కేసు విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని అడ్వకేట్ జనరల్ సుప్రీం కోర్టును కోరారు. అసలు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఏం చెప్తుంది..? ఈ కమిటీ నివేదికలో ఏముంది అని ఒక్కసారి పరిశీలిస్తే..
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా తెలిపింది. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రచారం చేస్తున్నట్లుగా విజయవాడ, గుంటూరు నగరాల మధ్య పెద్ద రాజధాని నిర్మాణం కూడా కరెక్ట్ కాదని ఆ నివేదిక తెలియచేసింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగరి అర్బన్ డవలప్మెంట్ ఏరియా గోవా రాష్ట్రానికంటే రెండు రెట్లు పెద్దవని కమిటీ తన నివేదికలో తెలిపింది.రాజధానికి వ్యవసాయ భూముల్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకోవాలని సూచించింది. కానీ చంద్రబాబు మాత్రం కొన్ని లక్షల కోట్లను కర్చు చేసి మరీ రైతుల భూములను కొనుగోలు చేశారు. కొందరు రైతులు భూములు ఇవ్వడానికి వెనకాడితే.. వారిని బెదిరించి మరీ భూములు లాక్కున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అమరావతి భూముల్లో నీరు పై పొరల్లో మాత్రమే ఉంటుందని.. ఇక్కడి నెలలు అంతా గట్టిగా ఉండవని, అదీ కాక ఈ అమరావతి ప్రాంతం వర్షాకాలం నాడు ముంపునకు గురవుతుందని కూడా ఈ కమిటీ చాలా స్పష్టంగా తమ నివేదికలో తేల్చి చెప్పింది. సో.. ఇన్ని అడ్డంకులు ఉన్నాయి కాబట్టే.. తాము మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరపాకి తెచ్చామని ఏపీ ప్రభుత్వం అంటోంది. మరి ఈ నెల 23న ఏపీ రాజధాని విషయంలో సుప్రీ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.