బాబుకు షాక్…వైసీపీలోకి మరో టీడీపీ సీనియర్ నేత..?

ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి.. అన్న సామెత ఊరికే లేదు. రాజకీయాల్లో రాజకీయ నేతలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎవ్వరూ ఊహించలేని పరిణామ౦. వైసీపీలో అదే ధోరణి మొదలవ్వగా.. అది సీఏం జగన్ కి పెద్దగా నష్టాన్ని కలిగించే విషయం కాదనే చెప్పాలి. ఇక టిడిపి విషయానికొస్తే.. ఇప్పుడు ఉన్న నాయకులతో పాటు కొత్త నాయకుల అవసరం టిడిపికి ఎంతైనా ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే.. టిడిపి నాయకులు మరింతగా కృషీ చేయాలి. అయితే ఇప్పుడు బాబుకు ఓ సీనియర్ నేత భారీ షాక్ ఇవ్వబోతున్నారు అన్న వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ఓ కుటుంబంలో నెలకొన్న అంతర్గత పోరు.. టిడిపి ని వదిలే స్థితికి వచ్చారు అంటే.. వారి మధ్య ఎంతలా ఆధిపత్య పోరు నడుస్తుందో అర్ధం చేసుకోవాలి. ఇంతకీ.. ఆ ఎవరా ఫ్యామిలీ సభ్యలు…? ఎందుకోసం ఈ కొట్లాట..? వారే యనమల బ్రదర్స్. సీనియర్ నేత యనమల కృష్ణుడు గుర్రుగా ఉన్నారని అక్కడి నేతలు అంటున్నమాట. ఆయన చూపు వైసీపీ వైపు మళ్ళిందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. యనమల రామకృష్ణుడుకి వార్నింగ్ కూడా ఇచ్చారట. అవును మీరు విన్నది అక్షరాలా నిజం. ప్రస్తుతం తుని రాజకీయాలలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

అసలు ఈ ఘర్షణకు గల కారణాలు ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో కాకినాడ జిల్లా తుని నుంచి యనమల కృష్ణుడుని పక్కనపెట్టారు. తుని నియోజకవర్గ ఇంచార్జిగా యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను చంద్రబాబు నియమించారు. దీంతో యనమల కృష్ణుడు వైసీపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ నేతలు సైతం ఆయనతో టచ్ లో ఉన్నారని టాక్ నడుస్తోంది. నిజానికి పార్టీలో రెండుసార్లు ఓటమి పాలయిన సీనియర్లకు నో టికెట్ అని అధిష్టానం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 2014 2019 ఎన్నికల్లో యనమల కృష్ణుడు పోటీ చేసి రెండుసార్లూ ఓడిపోయారు. సొ.. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత కీలకం. యువతకు 50% అవకాశం కల్పిస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే.. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అక్కడి తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ప్రస్తుతం తుని నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా ఉన్నారు. యనమల కృష్ణుడు పార్టీ మారుతున్నారు అన్న ప్రచారంపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.