అడ్డంగా ఇరుక్కున్న పవన్.. టీడీపీ – బీజేపీలో ఎవరికి షాక్..?

వచ్చే ఎన్నికలు టిడిపి, వైసీపీకి అత్యంత కీలకమైనవి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. గెలుపు కోసం నాయకులు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ ఇప్పటి నుంచే నెలకొంది. ఓ వైపు వై నాట్ 175 అంటూ సీఎం జగన్ , మరో వైపు 160 మాకే అంటూ చంద్రబాబు బహిరంగ ప్రకటన చేసుకుంటున్నారు. సవాల్ లు కూడా చేసుకుంటున్నారు. మా ప్రభుత్వం వస్తే.. మేమేంటో చూపిస్తాం అంటూ టిడిపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. వైసీపీ వ్యతిరేక వోటును చీలనివ్వనని పవన్ కళ్యాణ్ పదేపదే అదే అంటున్నారు. వచ్చే నెల ఇందుకు ముహూర్తగా ఫిక్స్ అయింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎట్టకేలకే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొమ్మది జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగంచుకొనే డిగ్రీ చదివిన వారు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలే వచ్చే ఎన్నికల్లో అధికారం ఎవరికి దక్కుతుంది అని డిసైడ్ చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

2019 ఎన్నికల్లో ఉపాధ్యాయుల్లో అధిక శాతం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పబ్లిక్ మూడ్ స్పష్టం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ- టీడీపీ తమ అభ్యర్దులను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో గెలవటం ద్వారా ఫైనల్స్ ముందు బలం చాటుకొనేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పుడు అధికార వైసీపీతో పాటుగా టీడీపీ, బీజేపీ కూడా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల పైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే.. జనసేన ఎవరికి మద్దతుగా నిలుస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. వచ్చే నెలలో జరగనున్న ఈ ఎన్నికలకు పవన్ కళ్యాణ్ తమ మద్దతు ఎవరికి తెలుపుతారో వచ్చే ఎన్నికల్లో పొత్తులు వారితోనే అన్న చర్చలు వస్తున్నాయి. చూడాలి మరి పవన్ కళ్యాణ్ మద్దతు ఎవరికి ఉంటుందో అనేది.