అఖిలప్రియకి షాకింగ్ న్యూస్..సీటుకి ఎసరు పెడుతున్న టీడీపీ నేత

భూమా అఖిలప్రియ సీటుకి నీలి నీడలు కమ్ముకుంటున్నాయా..? వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు దక్కడం కష్టమేనా..? నాడు ఆమె చేసిన తప్పిదాలే.. నేడు ఆమె రాజకీయ భవిష్యత్ కి భంగం గలగనుందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. భూమా ఫ్యామిలీకి రాజకీయాలలో ఎంత గుర్తింపు ఉందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు అంత సీన్ లేదని అర్ధమయ్యింది. భూమా అఖిలప్రియపై వస్తున్న ఆరోపణల్ని బట్టి ఈ వార్తలే ప్రచారం అవుతున్నాయి. ఆమె 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించి ఆ తర్వాత టిడిపి లోకి వెళ్ళి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆతర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆమె గ్రాఫ్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది.

2019 ఎన్నికల్లో ఓటమిపాలయిన అఖిలప్రియ.. ప్రజల్లో లేకపోవడం, అదేవిధంగా ఆమె చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఎన్నోరకాల కేసులు, కిడ్నాప్ లు, కొట్టించడం, బెదిరించడం.. అబ్బో ఇలా ఎన్నో రకాల పోలీసు కేసులు ఆమెపై ఉన్నాయి. అయితే.. ఆమె సీటుకి ఎసరు పెడుతున్నారని, అది కూడా ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడేనాని వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానని తనకు తానే ఓ ప్రకటన కూడా చేసుకున్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే అక్కడ ఏవీ సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది. బోండా ఉమా తన వియ్యంకుడు అయినటువంటి సుబ్బారెడ్డికి ఆళ్లగడ్డ టికెట్ ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నారట. ఈ మేరకు చంద్రబాబుతో కూడా ఉమా చర్చించారట. ఇక ఆళ్లగడ్డలో చంద్రబాబు ఏవీ సుబ్బారెడ్డి పేరు ప్రకటిస్తే.. అఖిలప్రియ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడినట్టేనని అక్కడి నాయకులు అంటున్నారు. మరి చివరకు ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో చడాలి.