సీఎం జగన్ పార్టీ పరంగా, పాలన పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలలో తమ జెండా ఎగురవేయాలని ఎంతో పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ నేపధ్యలోనే.. ఎమ్మెల్యేల పని తీరుపై ఇప్పటికే పలుమార్లు సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. మరొకసారి ఇదే విషయంపై సీరియస్ అయ్యారట. ఎన్నికలు సమీపిస్తున్నవేళ టిక్కెట్లు ప్రకటించే సమయం ఆసన్నమయ్యింది. టికెట్ల కేటాయింపు అంశంలో సీఎం జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వారి పని తీరుతో మాత్రమే టికెట్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుందని స్పష్టం చేసారు.
ఇప్పుడు తాజాగా సర్వే నివేదికల్లో ఆ 30 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మరోమారు హెచ్చరికలు వెళ్లాయట. ఈ డిసెంబర్ లోగా తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేకుంటే ఎట్టి పరిస్తుతులలోనూ టికెట్ దక్కదని తేల్చి చెప్పేశారట. గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎంతమంది చురుగ్గా ఉన్నారు అనే దానిపై కూడా సీఏం జగన్ ఓ సర్వే నివేదికను తన వద్దకు తెప్పించుకున్నారట. అయితే కొన్ని చోట్ల ఈ కార్యక్రమంలో కొంతమని ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారని సీఎం జగన్ వద్దకు సర్వే రిపోర్ట్ చేరిందట. తాజాగా అందిన రిపోర్ట్ అంశాన్ని నేడు జరిగిన సమావేశంలో ప్రస్తావించారట. ఇంకా కొంతమంది పనితీరులో ఎలాంటి మార్పు లేదని సీఏం జగన్ సీరియస్ అయ్యారట. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలాంటి తప్పిదాలు చేస్తున్నారు, ఎలాంటి ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు అన్న దానిపై కూడా సీఏం జగన్ సర్వే చేయించారట. మొత్తంగా చూస్తే సిఎం జగన్ గట్టి ఫోకస్ పెట్టారని చెప్పాలి.