400 రోజులు, 4000 కిలోమీటర్లు అంటూ పాదయాత్ర మొదలుపెట్టిన నారా లోకేష్ కి అనుకున్నంత ఆదరణ వస్తుందా..? లోకేష్ పాదయాత్రకు జనాల్ని తరలిస్తున్నారా..? టిడిపిలో ఉన్న నాయకులకు లోకేష్ పాదయాత్ర చేయడం ఇష్టంగా లేదా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. అదేంటి సొంత పార్టీ నాయకులు మద్దతు ఉండకుంటా ఎలా ఉంటుంది అన్న అనుమానం కూడా కలగవచ్చు. కొద్ది రోజుల క్రితం జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. పాదాయత్రలకు కాలం చెల్లిందని జేసీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో పెను దుమారమే రేపాయి అని చెప్పాలి.
ఇంకో విషయం ఏంటంటే.. పాదయాత్రకు జనాల్ని తరలించాలని అచ్చెన్న పేరిట ఓ ఆడియో లీక్ అయ్యింది. అంటే లోకేష్ పాదయాత్రకు ఎలాగూ జనాలు రారు.. జనాలు రాకుంటే.. బాబుగారు బాదపడతారు అని చెప్పేసి ఈ వ్యవహారానికి పూనుకున్నారని రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. ఇక్కడ అసలైన మ్యాటర్ ఏంటంటే.. లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన నాడు ఏదో అధిష్టానం పిలుపు మేరకు సీనియర్లు మొహమాటం కొద్ది అలా వచ్చి ఇలా వెల్లారే తప్ప.. నిజంగా వచ్చే ఉద్దేశ్యమే లేదని టిడిపి లో ఉన్న కొందరు నాయకులు అంటున్నమాట. ఇప్పటికి యువగళం పాదయాత్ర 17 రోజులు పూర్తి చేసుకోగా.. ఒక్కరంటే ఒక్క సీనియర్ నాయకుడు పాదయాత్రలో పాల్గొన్నది లేదు.
ఏదో ప్రెస్ మీట్ లు పెట్టి మేమున్నామని గుర్తుచేయడం కొరకు హాజరు వేయించుకోవడం తప్ప ఇంకెలాంటి ఉపయోగం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే.. లోకేష్ పాదయాత్ర కు మొదట్లో పార్టీ సీనియర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదట. ఆ తర్వాత చంద్రబాబు వారిని బుజ్జగించి.తమ లోకేష్ బాబుకి సపోర్ట్ చేయాలని బ్రతిమాలితే.. సరే అని తల మాత్రం ఉపారట. చిత్తూరుకే చెందిన సీనియర్లు ఎవరూ కూడా యాత్రలో పార్టిసిపేట్ చేయడం లేదు. మొత్తానికి లోకేష్ పాదయాత్రకు సీనియర్ల మద్దతు కరువయిందని.. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.