బాబుకు గట్టి దెబ్బ పార్టీకి రాజీనామా..కన్నీరు పెట్టుకున్న బీసీ నేత

రాజకీయాలలో ఎంత కష్టపడి పని చేసినా ఫలితం దక్కదు. అలా చాలామంది రాజకీయాలలో విసిగి వేశారిపోయిన వాళ్ళు ఉన్నారు. పార్టీ కోసం తమ పనులు మానుకొని ఆస్తులను అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వారే ప్రస్తుతం టీడీపీలో ఒక్కొక్కరు బయటపడుతున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ.. ఫలితం దక్కకపోగా తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ.. టిడిపి లో ఉన్న కొందరు నాయకులు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఏ నేపధ్యంలోనే టిడిపి కి మార్వి ఎదురు దెబ్బ తగిలింది. మరో టీడీపీ సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మరెవరో కాదు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం. ఈయన బీసీ సమాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడు.

టీడీపీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదని.. అందుకే పార్టీలో కొనసాగలేనని, టీడీపీకో దండం అంటూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేస్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. బీసీలకు టీడీపీలో ప్రాధాన్యత లేదని.. ఇకపై కూడా ఇవ్వరని, చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 15 ఏళ్లపాటు టీడీపీలో పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు లేదని.. కష్టపడి పని చేసేవారికి కాకుండా తన సామాజిక వర్గ నేతలకే బాబు పదవులు కట్టబెడుతున్నారని సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలోనే తాను ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని.. ఏ రాజకీయ పార్టీలో చేరాలనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.