బీజేపీకి బిగ్ షాక్.. కన్నా రాజీనామా, జీవీఎల్ కో దండం

బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా చేశారు. గుంటూరులో తన అనుచరులతో సమావేశమైన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. చివిరికి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీలో కొందరు నేతల తీరుతోనే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరిగా లేదని.. అందుకే రాజీనామా చేస్తున్నామంటున్నారు. కన్నాతో పాటు తన ముఖ్య అనుచరులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. పార్టీలో పరిస్థితులు మారాయంటూ కన్నా వాపోయారు. అందుకే తాను పార్టీలో ఇమాడలేక పోతున్నానని కన్నా తన మనసులో మాట చెప్పారు. కోవిడ్ అనంతరం తనను మార్చేశారని, సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో పరిస్థితులు మారాయని అన్నారు. కన్నా ఎపిసోడ్‌‌ను మీడియా ప్రతినిధులు ఎంపీ జీవీఎల్ నరసింహరావు దగ్గర ప్రస్తావించగా.. ఆయన దండం పెట్టి వెళ్లిపోయారు.