ఏపీలో వచ్చే ఎన్నికల పోరు మరింతగా ముదురుతోంది. వచ్చే ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ఏపీలోని రాజకీయ పార్టీలు. ఇక ఈ నేపధ్యంలోనే.. సీఏం జగన్ పదునైన వ్యూహాలతో, పక్కా ప్రణాళికలతో టిడిపి కి స్కెచ్ పెట్టే విధంగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ సర్కార్.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది గృహసారధుల్ని నియమిస్తోంది.50 ఇళ్లకొక వాలంటీర్ ఉండగా.. వీరికి అదనంగా ఇద్దరు గృహసారధుల్ని నియమిస్తోంది, పార్టీ కన్వీనర్లు, క్లస్టర్లను నియామిస్తోంది. మొత్తం 5 లక్షల 20 వేల మందిని నియామిస్తోంది. దీంతో చంద్రబాబు కూడా జగన్ బాటలోనే నడుస్తున్నారు. కుటుంబ సాధికార సారధుల పేరుతో నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనాన్ని చేరువయ్యేందుకు విపక్ష టీడీపీ కొత్త వ్యవస్ధల్ని సిద్దం చేసుకుంటోంది.
ఇందులో భాగంగా సాధికార సారధుల పేరుతో కొత్త వ్యవస్ధకు రూపకల్పన చేస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల భేటీలో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే ఏం చేయబోతున్నామో సదరు కుటుంబాలకు వివరించబోతున్నట్లు సమాచారం. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్ లు అందరినీ కుటుంబ సాధికార సారధులుగా పిలుస్తామన్నారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారధి ఉంటారని, ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారధి విభాగం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ విభాగం పని చేస్తుందన్నారు. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. అసలు గెలిచే అవకాశాలు లేనప్పటికీ మీ ప్రయాశ వృధా అంటున్నారు. గతంలో అధికారంలో ఉండి ఏం చేశారని.. మళ్ళీ అధికారం ఇవ్వమని ఏ మొహం పెట్టుకొని ప్రజల్ని ఓట్లు అడుగుతారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.